తెలంగాణ

ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల పర్యవేక్షణకు రెగ్యులేటరీ అథారిటీని ఏర్పాటు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్, కార్పొరేట్ ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్, క్లినిక్‌లు, డయాగ్నొస్టిక్ కేంద్రాల పనితీరును నియంత్రించడానికి, పర్యవేక్షించడానికి ప్రభుత్వం రెగ్యులేటరీ అధారిటీని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ సోమవారం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) మైనారిటీల విభాగం చైర్మన్ షేక్ అబ్దుల్లా సోహేల్ నేతృత్వంలో కాంగ్రెస్ నాయకుల ప్రతినిధి బృందం వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు తన నివాసంలో కలిసి వినతి పత్రం సమర్పించారు. కార్పొరేట్ ప్రైవేట్ ఆసుపత్రులు తమ కార్యకలాపాలను పర్యవేక్షించడానికి ఒక యంత్రాంగం లేకపోవడాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నారో మంత్రికి వివరించారు. రోగులకు ఇవ్వబడుతున్న చికిత్స, వారి నుండి వసూలు చేయబడుతున్న ఛార్జీలను క్రాస్ చెక్ చేయడానికి ఎవరూ లేరు. రిజిస్ట్రేషన్ ఫీజు నుండి సంక్లిష్టమైన శస్తచ్రికిత్సా విధానాల వరకు, ప్రతిదీ చాలా ఖరీదైనది వారిని ప్రశ్నించే అధికారం ఎవరికీ లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇటీవల నగరంలోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల సందర్శించి ఆసుపత్రి యాజమానులకు పలు సూచనలు చేయడం జరిగిందన్నారు. ఈ విషయంలో తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి ఈటెల హామి ఇచ్చారని అబ్దుల్లా సోహైల్ తెలిపారు.
*చిత్రం...మంత్రి ఈటలకు వినతి పత్రమిస్తున్న టీపీసీసీ మైనార్టీల విభాగం చైర్మన్ సోహైల్