తెలంగాణ

మండలిని సీఎం కేసీఆర్ లైట్‌గా తీసుకుంటున్నారు: జీవన్‌రెడ్డి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 23: శాసనమండలిని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు లైట్ తీసుకుంటున్నారని శాసనమండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు టి జీవన్‌రెడ్డి విమర్శించారు. మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పలేకపోయిందన్నారు. శాసనసభ ఆవరణలో సోమవారం జీవన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ శాసనమండలికి గౌరవం ఇవ్వడం లేదన్నారు. మండలి బడ్జెట్ సమావేశాలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావుతోనే సరిపెట్టడమంటే ఆగౌరవపరిచినట్టు కాదా? అని జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. పెద్దల సభగా చెప్పుకునే మండలికి సీఎం కేసీఆర్ కనీసం హాజరుకాకపోవడం అగౌరవపర్చడం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఎక్కువగా నష్టపోయింది గిరిజనులేనని జీవన్‌రెడ్డి విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో గిరిజనలకు 6 శాతం రిజర్వేషన్లు ఉండేవన్నారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు కల్పించాల్సి ఉందన్నారు. అయినా ప్రభుత్వం పట్టనట్టు వ్యవహరిస్తుందని జీవన్‌రెడ్డి విమర్శించారు.

*చిత్రం...మండలిలో కాంగ్రెస్ పక్షం నాయకుడు జీవన్‌రెడ్డి