జాతీయ వార్తలు

కాశ్మీర్-లడక్ ఉద్యోగులకు 7వ పే-కమిషన్ వేతనాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, అక్టోబర్ 22: కొత్తగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పాటైన జమ్మూ-కాశ్మీర్, లడక్‌లోని ప్రభుత్వ ఉద్యోగులకు 7వ పే-కమిషన్ ప్రకారం ఈ నెల 31 నుంచి వేతనాలు, ఇతరత్రా లాభాలు కల్పించనున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఆ శాఖ ఆదేశాలు జారీ చేసింది. 7వ సీపీసీ ప్రకారం జీత భత్యాలు చెల్లించే ప్రతిపాదనలకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆమోద ముద్ర వేశారని అధికారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఆగస్టు 5వ తేదీన రాజ్యాంగంలోని 370-అధికరణను రద్దు చేసి జమ్మూ-కాశ్మీర్, లడక్‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన సంగతి తెలిసిందే. కొత్తగా ఏర్పాటైన ఈ మూడు కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ నెల 31 నుంచి అధికారికంగా అమల్లోకి రానున్నాయి. అమలులోకి రానున్న రోజు నుంచే ప్రభుత్వ ఉద్యోగులకూ ఈ సౌకర్యాలు వర్తించేలా ప్రభుత్వం చర్యలు తీససుకున్నది. దీంతో 4.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు మేలు జరగనున్నది. కేంద్ర పాలిత ప్రాంతాలుగా మార్చిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆగస్టు 8న ఆ మూడు ప్రాంతాల ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ మిగతా కేంద్ర పాలిత ప్రాంతాల్లోని ప్రభుత్వ ఉద్యోగులకు జీత-్భత్యాలు చెల్లిస్తున్న తరహాలోనే ఇక్కడి ఉద్యోగులకూ చెల్లిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఉద్యోగుల పిల్లల చదువులకూ, వసతి, రవాణా భత్యం, ఎల్‌టీసీ, మెడికల్ తదితర అలవెన్సులూ చెల్లిస్తామని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.