రాశిఫలం -11/09/2019

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
శుద్ధ ద్వాదశి మ.1.25
నక్షత్రం: 
ఉత్తరాభాద్ర మ.2.46
వర్జ్యం: 
రా.3.58 నుండి 5.43 వరకు విశేషాలు: చిలుకద్వాదశి, క్షీరాబ్దిపూజ, తులసీవ్రతారంభం, శనిత్రయోదశి
దుర్ముహూర్తం: 
ఉ.06.00 నుండి 07.36 వరకు
రాహు కాలం: 
ఉ.9.00 నుండి 10.30 వరకు
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరింపబడతాయి. నూతన గృహ కార్యాలపై శ్రద్ధ వహిస్తారు. ఆకస్మిక ధనలాభంతో ఆనందిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. దైవదర్శనం చేసుకుంటారు. భక్తిశ్రద్ధలధికమవుతాయి.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. వృత్తి ఉద్యోగ రంగాల్లో స్థానచలన సూచనలున్నవి. ఆర్థిక పరిస్థితిలో మార్పులుంటాయి. ఋణప్రయత్నాలు చేస్తారు. ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) అనారోగ్య బాధలు అధికమవుతాయి. అకారణంగా కలహాలేర్పడే అవకాశాలుంటాయి. అనవసర భయానికి లోనవుతారు. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు. వ్యాపార రంగంలోనివారు జాగ్రత్తగా నుండుట మంచిది. స్ర్తిలు పిల్లలపట్ల మిక్కిలి శ్రద్ధ వహిస్తారు.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్రేష) ఆకస్మిక ధననష్టంపట్ల జాగ్రత్త అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్య బాధలుంటాయి. వృధా ప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలున్నాయి. సన్నిహితులతో విరోధమేర్పడకుండా మెలగుట మంచిది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వ్యవసాయ రంగంలోని వారికి లాభదాయకంగా వుంటుంది. తొందరపాటువల్ల ప్రయత్న కార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా నుండుట మంచిది. ఆకస్మిక భయము, ఆందోళన ఆవహిస్తాయి. శారీరకంగా బలహీనమేర్పడుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) అనారోగ్య బాధలతో సతమతమవుతారు. స్థానచలన సూచనలుంటాయి. నూతన వ్యక్తులు కలుస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుండక మానసికాందోళన చెందుతారు. గృహంలో మార్పులు కోరుకుంటారు. ఆర్థిక ఇబ్బందులు దూరమవుతాయి.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో నిమగ్నులవుతారు. స్ర్తిల మూలకంగా లాభంవుంది. పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. ఋణబాధలు తొలగుతాయ. ఆరోగ్యం మెరుగవుతుంది.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) స్ర్తిల మూలకంగా లాభాలుంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధనలాభముంటుంది. కుటుంబం అంతా సౌఖ్యంగా వుంటారు. అత్యంత సన్నిహితులను కలుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు సంపూర్ణంగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది. నూతన వస్తు, ఆభరణాలు సేకరిస్తారు.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలన సూచనలుంటాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలెక్కువ చేస్తారు. అనారోగ్యమేర్పడకుండా జాగ్రత్త అవసరం.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు. శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి అవుతాయి
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) నూతన కార్యాలు ఆలస్యంగా ప్రారంభిస్తారు. అల్పభోజనం వల్ల అనారోగ్యాన్ని పొందుతారు. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురిచేస్తుంది. అసత్యానికి దూరంగా నుండుట మంచిది.. విద్యార్థులు చంచలంగా ప్రవర్తిస్తారు.
Date: 
Saturday, November 9, 2019
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి