తెలంగాణ

సోషల్ మీడియాలో విద్వేషపూరిత ప్రచారాన్ని నియంత్రించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: రెవెన్యూ ఉద్యోగులపై దాడులను ప్రోత్సహిస్తూ సోషల్ మీడియాలో జరుగుతున్న విద్వేషపూరిత ప్రచారాన్ని వెంటనే నియంత్రించి, ఈ ప్రచారం చేసే వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని తెలంగాణ రెవెన్యూ జేఏసీ కోరింది. ఈ మేరకు శుక్రవారం రాష్ట్ర పోలీస్ శాంతి భద్రతల అదనపుడీజీపీ జితేందర్‌ను కలిసి జేఏసీ నేతలు వినతిపత్రాన్ని అందజేశారు. ఇటీవల రెవెన్యూ ఉద్యోగులపై దాడులు చేయాలని రెచ్చకొడుతున్నారని, ఇటువంటి వారిపై కఠినంగా వ్యవహరించాలని, లేకపోతే తహశీల్దార్ విజయారెడ్డి హత్య వంటి దారుణ ఘటనలను పునరావృతం అయ్యే ప్రమాదం ఉందని జితేందర్‌కు జేఏసీ నాయకులు వివరించారు. అదనపు డీజీపీని కలిసి వినతిపత్రం సమర్పించిన వారిలో జేఏసీ నేతలు లచ్చిరెడ్డి, రాములు, ఉపేందర్ రావు, లక్ష్మీనారాయణ, సుదర్శన్, రాములు తదితరులున్నారు.