జాతీయ వార్తలు

నా ఆశయం సిద్ధించింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 9: వివాదాలను, వైషమ్యాలను విడనాడి మతసామరస్యం, శాంతి దిశగా ప్రతి ఒక్కరూ కలిసి పని చేయాల్సిన తరుణం ఆసన్నమైందని బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ అన్నారు. అయోధ్యపై సుప్రీం కోర్టు తాజాగా వెలువరించిన తీర్పు తన వాదననే రుజువు చేసిందని, ఈ చారిత్రక తీర్పు తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని తెలిపారు. అయోధ్యలో అత్యద్భుత రీతిలో రామాలయ నిర్మాణానికి ఈ తీర్పు సుగమం చేయడం తనకు ఎంతో సంతృప్తిని ఇస్తోందని, రామజన్మభూమి ఉద్యమంలో క్రియాశీల భూమిక పోషించిన అద్వానీ అన్నారు. అయోధ్యలో రామాలయం కోసం జరిగిన ప్రజా ఉద్యమంలో తన వంతు తోడ్పాటు అందించే అవకాశాన్ని ఆ దేవుడు తనకు ఇచ్చారని తెలిపారు. భారత దేశ స్వాతంత్య్ర పోరాటం
తర్వాత అంతే భారీ స్థాయిలో జరిగిన ఉద్యమంగా రామాలయ నిర్మాణ ఉద్యమాన్ని ఆయన అభివర్ణించారు. సుప్రీం తాజా తీర్పుతో ఉద్యమ లక్ష్యం నెరవేరిందని తన కల ఫలించిందని అద్వానీ తెలిపారు. ఐదుగురు సభ్యుల ధర్మాసనం ముక్తకంఠంతో ఈ తీర్పును వెలువరించిందని, ఇది మరింత ఆనందకర విషయమని అద్వానీ పేర్కొన్నారు. భారత సాంస్కృతిక, నాగరికత చరిత్రలో రాముడికి, రామాయణానికి అత్యంత పవిత్రమైన స్థానం ఉందని పేర్కొన్న ఆయన రాముడి పవిత్ర జన్మస్థలం అంశం కూడా ప్రతి భారతీయుడి హృదయంలోనూ అంతగానూ నిండిపోయిందని అద్వానీ పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో ప్రజల నమ్మకం, మనోభావాలకు గౌరవం దక్కిందని గత కొన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదస్పద ప్రక్రియకు తాజా పరిణామం ముగింపు పలికిందని తెలిపారు. ‘మందిర్-మసీదు వివాదానికి తెర పడింది. ఇప్పుడు ప్రతి ఒక్కరూ కలిసి పని చేసి శాంతి-సామరస్యాలను పెంపొదించాలి’ అని అన్నారు. అలాగే జాతీయ సమైక్యత, సమగ్రతల పరిరక్షణకు ప్రతి భారతీయుడు ముందుకు రావాలని, భిన్నత్వంలో ఏకత్వం భావనకు మరింత వనె్న తేవాలని పిలుపునిచ్చారు. అయోధ్యలో మసీదు నిర్మాణానికి ఓ ప్రముఖమైన చోటే ఐదు ఎకరాల స్థలాన్ని ముస్లింలకు ఇవ్వాలని సుప్రీం కోర్టు నిర్ణయించడం కూడా స్వాగతించదగ్గ అంశం అని సర్వోన్నత న్యాయస్థానం చారిత్రక తీర్పును యావత్ భారత పౌరులతో తానూ స్వరం కలుపుతున్నానన్నారు.
*చిత్రం... బీజేపీ సీనియర్ నాయకుడు ఎల్‌కె అద్వానీ