హైదరాబాద్

సుప్రీం తీర్పుపై హర్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సికింద్రాబాద్: అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును సామాన్యులతో పాటు మజ్లిస్ మినహా నగరానికి చెందిన అన్ని పార్టీల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొందరు దేశ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును అందరూ గౌరవించాల్సిందేనని వ్యాఖ్యానించగా, మరికొందరు మాట్లాడేందుకు నిరాకరించారు. తీర్పు నేపథ్యంలో నగరంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తుగా బందోబస్తు చేపట్టారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం నుంచే షాపులు మూతపడ్డాయి.
పెద్ద సమస్య పరిష్కారమైంది
‘ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదానికి ఎట్టకేలకు సుప్రీంకోర్టు శనివారం తెర దింపింది. ఈ తీర్పును అందరూ ఆహ్వానించాలి. విశ్వాసాలను, చారిత్రక ఆధారాలను, పురావస్తు నివేదికలను పరిశీలించి శాస్ర్తియతంగా రాజ్యంగానికి లోబడి ఈ తీర్పు ఉంది. కోర్టు అయోధ్య చట్టం తీసుకువచ్చి ట్రస్టును ఏర్పాటు చేసి వివాదస్పద భూమిలో రామాలయ నిర్మాణానికి అనుకూలంగా తీర్పునివ్వటం పట్ల హిందూవులు ఎంతో ఆనంద పడుతున్నారు. మసీదు కోసం అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలమివ్వాలని కూడా కోర్టు ఆదేశించింది. ఇరువర్గాల విశ్వాసాలను పరిగణనలోకి తీసుకుని, సమన్యాయం చేసేలా తీర్పు ఉంది.’ అని కాగ్రెస్ అధికార ప్రతినిధి ఇందిరా శోభన్ పేర్కొన్నారు.
ఇది చారిత్రాత్మక తీర్పు
‘అయోధ్య రామజన్మభూమిపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమైంది. అందరి మనోభావాలను పరిగనలోకి తీసుకుని, అన్ని కోణాలలో పరిశీలించినానంతరమే సుప్రీం వెలువరించిన ఈ తీర్పుపై ఇంకా కొందరు అసంతృప్తిని వ్యక్తం చేయటం తగదు. ప్రపంచ దేశాలలో ప్రశంసలు పొందుతున్న తీర్పు ఇది దీనిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి.’ అని బీజేపీ సీనియర్ నాయకుడు సారంగపాణి చెప్పారు.
లౌకిక వారసత్వ పరిరక్షణ
‘దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు లౌకిక వారసత్వ సంపదను కాపాడుకున్నట్లు అయ్యింది. సుప్రీంకోర్టు తీర్పు మనందరికీ శిరోధార్యమే, సుప్రీం ఇచ్చిన తీర్పుకు మించిన పరిష్కారం లేదనే విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే.’ అని సీపీఎం నగర కార్యదర్శివర్గ సభ్యుడు కేఎన్ రాజన్న అన్నారు.
కోర్టు తీర్పు స్వాగతించాలి
‘సుప్రీంకోర్టు తీర్పుతో దేవాలయంపై మసీదు నిర్మించిన విషయం తెలిపోయింది. ఇంకా ఎందుకు అసంతృప్తి. అయోధ్యలోనే ఐదు ఎకరాల స్థలమిస్తే అక్కడ మసీదు నిర్మించుకోవచ్చు. ఇరువర్గాల ప్రజలు పరస్పరం దేవాలయం, మసీదు నిర్మాణం కోసం సహకరించుకోవాలి.’ అని వీహెచ్‌పీ మహాంకాళి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్ గుప్తా అభిప్రాయపడ్డారు.
దేశాభివృద్ధికి శుభ సూచికం
‘ఈ తీర్పుతో మా జీవితాలలో మార్పేమి రాదు. కానీ దేశ శాంతిభద్రతలు, ప్రజల మనోభావాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ప్రభావితం చేసే ఓ జఠిలమైన సమస్య పరిష్కారమైంది. ఇది ఒక రకంగా దేశాభివృద్ధికి శుభ సూచికమే. మనుషులంతా ఒక్కటే అనేన్న భావనతో ఇరువర్గాలు పరస్పరం సహకరించుకోవాలి’ అని అడ్డగుట్ట ఆటోడ్రైవర్ శంకర్ చెప్పారు.