హైదరాబాద్

తెలుగు సంస్కృతిని కాపాడుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాచిగూడ: తెలుగు సంస్కృతిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు వక్తలు అన్నారు. ఢిల్లీ తెలుగు అకాడమీ ఆధ్వర్యంలో ‘నృత్య ‘బృందా’వనమ్’ పేరిట విలక్షణ విన్యాస కార్యక్రమం శనివారం భారతీయ విద్యాభవన్‌లో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తమిళనాడు మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దిల్లీ ప్రతినిధి సముద్రాల వేణుగోపాల చారి, జస్టిస్ భవానీ ప్రసాద్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు డా.కేవీ రమణా చారి పాల్గొని కళాకారులు అభినందించి సత్కరించారు. నృత్య రంగంలో విలక్షణమైన విన్యాసం ప్రదర్శించారిని తెలిపారు. 100 నిమిషాల్లో 500 మంది కళాకారులు నృత్య ప్రదర్శనలు ప్రదర్శించి ఆకట్టుకున్నారు.
ఆకట్టుకున్న మీనాక్షి
‘్భరతనాట్య’ అరంగేట్ర ప్రదర్శన
కాచిగూడ, నవంబర్ 9: ప్రముఖ నాట్య గురువు స్మితా మాధవ్ శిష్యురాలు మీనాక్షి బత్తుల భరతనాట్య అరంగేట్ర ప్రదర్శన వర్ణ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో శనివారం రవీంద్రభారతిలో నిర్వహించారు. కార్యక్రమానికి ఆకాశవాణి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ శైలజా సుమన్, మాజీ డీసీపీ రంగారెడ్డి, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు, తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరికృష్ణ పాల్గొని మీనాక్షిని అభినందించి సత్కరించారు. మీనాక్షి భరతనాట్యంలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని అకాక్షించారు. మీనాక్షి ప్రదర్శించిన పుష్పాంజలి, అలరిప్పు, లింగాష్టకం, ఓంకార ప్రణవ వర్ణం తదితర అంశాలను ప్రదర్శించిన ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
కార్తీక మాస పురస్కారాలు ప్రదానం
కాచిగూడ, నవంబర్ 9: కార్తీక మాసం పురస్కారించుకుని స్వరమాధురి సాంస్కృతిక సంస్థ, శ్రీత్యాగరాయ గానసభ సంయుక్త ఆధ్వర్యంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ‘కార్తీక పురస్కారాలు’ ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం గానసభలోని గుండవరపు హనుమంత రావు వేదికలో నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బీఎస్ రాములు పాల్గొని చేనేత వర్గాల చైతన్య వేదిక అధ్యక్షుడు డా.చిక్కా దేవదాసు, చిక్కా కరుణ దంపతులు, గాయకుడు త్రినాథ రావు, జోగిని బ్రమరాంబికా దేవికి కార్తీక మాస పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రముఖ గాయనీ సాయి పావని నిర్వహణలో గాయనీ, గాయకులు తాడూరి అంజి, టీవీ లలితా రావు, టీవీ రావు, శారద, చంద్రజ్యోతి, నర్మద, విమల, వేంకటేశ్వర రావు, సురేందర్, సుబ్బిరెడ్డి అలపించిన సినీ గీతాలు అలరించాయి. మల్కాజిగిరి జడ్జ్ జస్టిస్ బూర్గుల మధుసూదన్, ఉజ్వల సాంస్కృతిక సంస్థ అధ్యక్షురాలు ఎం.లక్ష్మీ పాల్గొన్నారు.