తెలంగాణ

2020లో 14 మంది ఎస్‌ఓలు, పీఎస్‌ల పదవీ విరమణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో పనిచేస్తున్న 14 మంది సెక్షన్ ఆఫీసర్లు, ప్రైవేట్ సెక్రటరీలు 2020 లో వేర్వేరు తేదీల్లో పదవీ విరమణ చేస్తున్నట్టు ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. సాధారణ పరిపాలనా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అధర్ సిన్హా పేరుతో జీఓ (ఆర్‌టీ నెంబర్ 2928) జారీ అయింది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు. పదవీ విరమణ చేస్తున్న అధికారుల్లో మహ్మద్ అజీజుద్ధీన్ (రెవెన్యూ), పీ.కే. మనోహర్‌స్వామి (ఎనర్జీ), లతీఫ్ అహ్మద్ (హోం), ఎస్.ఎన్. శారదారాణి (యువజన సర్వీసులు) వి. సరస్వతి (జీఏడీ), బి. మల్లికార్జునరావు (పురపాలక సర్వీసులు), జి. శ్రీనివాసరావు (వెనుకబడిన తరగతుల సంక్షేమం), ఎం. రాజామణి (జీఏడి), ఏ. పద్మాచారి (ప్రణాళిక), ఎస్. అబ్దుల్ రహీం (జీఏడీ), కే.వీ. మురళీకృష్ణారావు (ఉన్నత విద్య), సీహెచ్. రాజ్యలక్ష్మి (రెవెన్యూ), సీ. లక్ష్మారెడ్డి (ఐ అండ్ సీఏడి), కే. శ్రీనివాసులు (ప్రణాళిక) పదవీ విరమణ చేస్తున్నారని వివరించారు. పభుత్వ నియమావళి ప్రకారం వీరంతా 58 సంవత్సరాలు నిండుతుండటంతో పదవీ విరమణ చేయాల్సి వస్తోంది. ఆ యా శాఖల ఉన్నతాధికారులు నిర్ణీత తేదీల్లో వీరిని రిలీవ్ చేయాలని ఆదేశించారు. పదవీ విరమణ చేస్తున్న వారంతా తమ పింఛన్ పేపర్లను సంబంధిత ఉన్నతాధికారులకు సకాలంలో అందించాలని సూచించారు.