తెలంగాణ

రెవెన్యూ ఉద్యోగులపై దాడులకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: అబ్దుల్లాపూర్‌మెట్ తహశీల్దార్ విజయారెడ్డి హత్య తర్వాత రెవెన్యూ ఉద్యోగులు ఒకవైపు ఆందోళన చేస్తుండగానే, మరోవైపు ఉద్యోగులను బెదిరించడం, దాడులు జరగడం ఆగలేదని తెలంగాణ రెవెన్యూ జేఏసి ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ రెవెన్యూ జేఏసి పక్షాన జి. ఉపేందర్‌రావు తదితరులు బుధవారం ఇక్కడ ఒక ప్రకటన విడుదల చేస్తూ, నాగర్‌కర్నూలు జిల్లా అచ్చంపేట రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో డిప్యూటీ తహశీల్దార్ రాములుపై దాడి జరిగిందని తెలిపారు.
కోర్టు వివాదంలో ఉన్న భూమి విషయంలోనే ఈ దాడి జరిగిందని వివరించారు. అలాగే మెదక్ జిల్లా హవేళీ ఘనపూర్ మండలం తహశీల్దార్ వెంకటేషంను ఒక వ్యక్తి కత్తితో బెదిరించాడన్నారు. రెవెన్యూ ఉద్యోగులపై దాడులు జరగకుండా చూస్తామంటూ ఉన్నతాధికారులు హామీ ఇచ్చినప్పటికీ దాడులు పునరావృతం కావడం శోచనీయమన్నారు. ప్రజలకు, రెవెన్యూ ఉద్యోగుల మధ్య అంతరం తొలిగించేందుకు ప్రభుత్వం ప్రయత్నించాల్సి ఉందన్నారు. ఈ అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని తెలంగాణ రెవెన్యూ జేఏసీ డిమాండ్ చేసింది.