తెలంగాణ

నేషనల్ స్కాలర్‌షిప్‌కు తెలంగాణ బాలిక ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: భారత ప్రభుత్వ సాంస్కృతిక కళారంగాల శాఖ ప్రకటించిన అవార్డుల్లో తెలంగాణ అమ్మాయి కృష్ణాద్వైత సృజనాత్మక రచనా రంగంలో స్కాలర్‌షిప్‌నకు ఎంపికైంది. ప్రతిభావంతులైన విద్యార్ధులకు అందించే నేషనల్ కల్చరల్ టాలెంట్ సెర్చి స్కాలర్‌షిప్‌లను 2019-20 సంవత్సరానికి గానూ కేంద్ర సాంస్కృతిక శాఖ ప్రకటించింది. సృజనాత్మక రచనా విభాగంలో తెలంగాణకు చెందిన ఎస్వీ కృష్ణాద్వైత ఎంపికైంది. రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ జడ్పీహెచ్ స్కూలులో పదో తరగతి చదువుతున్న ఈ బాలిక సృజనాత్మక రచనా విభాగంలో జాతీయస్థాయి స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన తొలి తెలుగు బాలిక. కృష్ణాద్వైత తెలుగులో ప్రముఖ రచయితలైన ఎస్వీ కృష్ణ- కృష్ణ జయంతి దంపతుల కుమార్తె. కృష్ణాద్వైతను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్ ఉమాదేవి సహా పలువురు ప్రశంసించారు. బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు వేరొక ప్రకటనలో ఆమెను అభినందించారు.