తెలంగాణ

హైదరాబాద్ ప్రతిష్ట మసకబారింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 13: అంతర్జాతీయ చిత్రపటంలో ఒకనాడు ఒక వెలుగు వెలిగిన హైదరాబాద్ ఖ్యాతి ప్రస్తుతం మసకబారిపోయిందని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఆందోళన వ్యక్తం చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఏ వర్గం ప్రజలూ సంతోషంగా లేరని విమర్శించింది. బుధవారం ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తహిశీల్దార్ విజయారెడ్డి సజీవ దహనం సంఘటతో రాష్ట్రంలో రెవెన్యూ సేవలు నిలిచిపోయాయని, నెల రోజులు దాటిన ఆర్టీసీ సమ్మె ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదన్నారు.
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు రాక అర్హులైన పేదలు , మూడెకరాల భూమి రాక దళితులు, ఆర్టీసీ సమ్మెను పరిష్కారం కాకపోవడంతో పస్తులతో గడుపుతోన్న ఆర్టీసీ కార్మికులు, ఆందోళనలో ఉన్న రెవెన్యూ ఉద్యోగులు ఇలా ఏ ఒక్కరైనా రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారా? అని రావుల ప్రశ్నించారు. చివరకు అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాలను కూడా నిర్వహించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు హయాంలో హైదరాబాద్ నగరం అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించి ఒక వెలుగు వెలిగిందని రావుల గుర్తు చేశారు. అప్పట్లో ఢిల్లీ పెద్దలు ఇతర దేశాధినేతలు ఎవరైనా వస్తే హైదరాబాద్ వెళ్లమని సూచించేవారని అన్నారు. అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ ఐక్యరాజ్య సమితికి వెళ్లినప్పుడు మీ దేశంలో మంచి నగరం ఏదని అడిగితే హైదరాబాద్ పేరు చెప్పారని అన్నారు. అయితే ఇప్పుడేమో ఎవరైనా హైదరాబాద్ వెళ్తాలనుకుంటే మీ రిస్క్‌తో వెళ్లమనే దుస్థితికి చేరుకుందని రావుల చంద్రశేఖర్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.