జాతీయ వార్తలు

సరి-బేసి విధానంపై సుప్రీం కోర్టు ఆరా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నూఢిల్లీ: ఢిల్లీలో వాయుకాలుష్యం నివారణకు ప్రభుత్వం అమలుచేస్తున్న సరి-బేసీ విధానంపై సుప్రీం కోర్టు ఆరా తీసింది. ఢిల్లీలో అక్టోబర్ నుంచి నవంబర్ 14 వరకు కాలుష్య పూర్తి నివేదికను అందజేయాలని ప్రభుత్వాన్ని, కేంద్ర కాలుష్య మండలిని ఆదేశించింది.సరి-బేసి విధానం ఈనెల 15వ తేదీతో ముగియనుంది. దీనిని అవసరమైతే వాయు కాలుష్య తీవ్రతను బట్టి మరికొంతకాలం పొడిగిస్తామని విలేఖరుల అడిగిన ప్రశ్నకు సమాధానంగా ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వివరించారు. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ‘ఎమర్జన్సీ’ స్థాయికి చేరుకోవడంతో రాష్ట్ర ప్రభుత్వం విధించిన ‘సరి - బేసి’ విధానాన్ని అవసరమైతే మరికొంతకాలం పొడిగిస్తామని, పొరుగు రాష్ట్రాల్లో పంటలను దగ్ధం చేయడం ద్వారా వెలువడుతున్న వాయు కాలుష్యం కారణంగా ఢిల్లీ ప్రతిష్ట ప్రపంచ వ్యాప్తంగా దెబ్బతిందని సీఎం పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రాల కారణంగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత ‘ఎమర్జన్సీ’ స్థాయికి చేరుకొందని ఆందోళన వ్యక్తం చేశారు.