కృష్ణ

అందుబాటులోకి వచ్చేనా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం: వరదల కారణంగా ఏర్పడిన ఇసుక కొరతను భూచిగా చూపుతూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమస్య పరిష్కార దిశగా అడుగులు వేస్తోంది. ఇసుక వారోత్సవాల పేరుతో ఇసుకను వినియోగదారులందరికీ ఇసుకను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చేస్తున్న కృషి ఏ మేర అన్నదే ప్రశ్నార్ధకంగా మారింది. గడిచిన ఆరు నెలలుగా నెలకొన్న సమస్య వారోత్సవాలతో ఒక్కసారిగా పరిష్కారమవుతుందా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. గురువారం ప్రారంభమైన ఇసుక వారోత్సవాలు ఈ నెల 20వతేదీ వరకు జరగనున్న సంగతి తెలిసిందే. ఇసుక కొరత లేకుండా చూడాలన్న ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అధికార యంత్రాంగం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. జిల్లా కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ ప్రత్యేక దృష్టి సారించి అవసరం మేర ఇసుకను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తున్నారు. జిల్లాలోని 16 నియోజకవర్గాలకు 16 స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశారు. ఆ స్టాక్ పాయింట్ల ద్వారా ఇసుక సరఫరా జరగనుంది. స్టాక్ పాయింట్ల వారీగా టన్ను ఇసుక ధరను నిర్ణయించారు. కనిష్టంగా రూ.375లు కాగా గరిష్టంగా రూ.825లుగా నిర్ణయించారు. విజయవాడ పశ్చిమ, తూర్పు, మధ్య నియోజకవర్గాలతో పాటు పెనమలూరు నియోజకవర్గాలకు సంబంధించి స్టాక్ పాయింట్లు అయిన భవానీపురం (సోమ), భవానీపురం (షాదీఖానా), కానూరులలో గరిష్టంగా రూ.825లు ధర నిర్ణయించారు. నందిగామ, పామర్రు, గన్నవరం, తిరువూరు నియోజకవర్గాలకు సంబంధించిన స్టాక్ పాయింట్లైన కంచెల, రొయ్యూరులలో కనిష్ఠంగా రూ.375లు ధర నిర్ణయించారు. ఇకపోతే నూజివీడు నియోజకవర్గ స్టాక్ పాయింట్‌లో రూ.725లు, మచిలీపట్నం, అవనిగడ్డ స్టాక్ పాయింట్లలో రూ.650లు, జగ్గయ్యపేట, మైలవరం స్టాక్ పాయింట్లలో రూ.625, గుడివాడ, కైకలూరు స్టాక్ పాయింట్లలో రూ.585 వంతున టన్ను ఇసుక ధరను నిర్ణయించారు. రోజు వారీ 6వేల టన్నుల ఇసుకను వినియోగదారులకు సరఫరా చేయనున్నారు. ఇందుకు గాను ప్రభుత్వం నిర్ణయించిన ధరల ప్రకారం రూ.22.50లక్షల ఆదాయం సమకూరనుంది. రవాణా చార్జీలు వినియోగదారుడికి తడిసి మోపిడయ్యేలా కనిపిస్తున్నాయి. ట్రాక్టర్, లారీ డ్రైవర్లు ఇష్టమొచ్చినట్టు రవాణా చార్జీలు వసూలు చేస్తున్నారు. దీనిపై అధికారుల నియంత్రణ కొరవడిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఇసుక సమస్య జిల్లాలో ఏ మేర పరిష్కారమవుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది.