Others

పెద్దరికాలు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంజలీదేవి, జగ్గయ్య, గిరిజ ప్రధాన తారాగణంగా 1957లో వచ్చిన పెద్దరికాలు అప్పట్లో ప్రేక్షకులను ఎంతో అలరించింది. సందేశాలు ఇచ్చే పని పెట్టుకోకుండా ఒక మంచి కథను సూటిగా చెప్పే ప్రయత్నం చేసిన ఈ చిత్రానికి దర్శకుడు చాణక్య. భద్రయ్య ఒక భూస్వామి. అతనికి డబ్బంటే చాలా ఇష్టం. పైగా బోలెడు పట్టుదల. కొడుకు సత్యం మందబుద్ధి. తండ్రి ఎదుట గొంతు ఎత్తలేడుకానీ, పొలంగా స్వేచ్ఛా స్వాతంత్య్రం అంటూ పాటలు పాడుతూ ఉంటాడు. సత్యం మావగారు దారిద్య్రం, అప్పులతో బాధపడుతుంటాడు. పండుగకు కూతురు, మనవడ్ని తీసుకెళ్తాడు. ఆ సమయంలో అప్పులవాడు వచ్చి గొడవ చేయటంతో కూతురు తన నగలన్నీ ఇచ్చేస్తుంది. భద్రయ్య కూతురు నిచ్చితార్థం కుదరడంతో కోడలు నగలు లేకుండా అత్తారింటికి వెళ్తుంది. భద్రయ్య ఆమె ఒక్కర్తినే తిరిగి ఇంటికి పంపించేస్తాడు. ఆ తరువాత భద్రయ్య కుమార్తె భర్తతోపోట్లాడి పుట్టింటికి రావడం, ఆమెకు పశ్చాత్తాపం కలగటం.. అందువల్ల మందబుద్ధి అయిన భద్రయ్య కుమారుడు తెగించి భార్యకోసం వెళ్తాడు. ఇంతలో ఇంకో దుర్మార్గుడి వలన సత్యం భార్య శీలాన్ని శంకిస్తాడు. చివరకు కొండల్లాంటి కష్టాలు మంచులా కరిగిపోతాయి. మన హృదయాలూ కరిగిపోతాయి. ఇందులో గోవిందరాజుల సుబ్బారావు, జగ్గయ్య, అంజలీదేవి, రేలంగి తదితరులు చక్కగా నటించారు. ముఖ్యంగా అంజలీదేవి -జగ్గయ్య, గిరిజల మధ్యవచ్చే సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయ. గోవిందరాజుల సుబ్బారావుతో పోటీపడి ముగ్గురూ నటించారు. గోవిందరాజుల నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. సారథి స్టూడియోవారు తమ గత చిత్రాల స్థాయకి ఏమాత్రం తగ్గకుండా ఈ చిత్రాన్ని ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించారు. కథ నార్ల చిరంజీవిది అయితే, మాటలు తాపీ ధర్మారావువి. కొసరాజు పాటలకు వేణు బాణీలుకట్టగా, ఘంటసాల, సుశీల, జిక్కి తదితరులు హాయిగాపాడారు. రాగిణి చేసిన నృత్యంలో పాటలో చరణానికి ఒక చెడ్డ మనిషిని కోప్పడటం బాగుంటుంది. ఇప్పటికీ ఈ చిత్రం చూస్తే మనసుకు హాయిగా అనిపిస్తుంది. అందుకే ఈ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం.
-డిఎస్ శంకర్, వక్కలంక