Others

సత్యం శివం సుందరం సృ స్థి ల (సృష్టి స్థితి లయ) 2 వ భాగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

22
తలెత్తి చూశాను- వెలుగు చీకట్ల చిన్ముద్ర
‘‘నీవు నాలోనె యున్నావని తెలియుటకు
పట్టెనిన్నాళ్ళు నా మనోభ్రాంతి వీడె
జ్ఞాన నేత్రము దెరచు ప్రకాశ లవము
దోచె! దుఃఖ జీమూతమ్ము తొలగిపోయె
లలిత మృదుభావ సుకుమార లాలసతను
మైమరపు జెంది, ఏదొ యున్మాదమొంది
భ్రమణమొనరించితిని శూన్య వలయమందు
మిగిలినది స్వాంతమొక్కటె మిన్నుదవిచి
నిర్మల స్వాంతమొందు ను న్మీలనమ్ము ఒక్క త్రుటిలోన సప్త వర్ణోత్సమయి
పృధివి గగనమ్ము దరిచేర్చు విల్లుదోచె
ఆ ప్రభాపుంజ మాత్మయై ఆకళించె
శివధనుర్భంగమొనరించి సీత హృదిని
తనది గావించుకొనె స్వామి తరళమూర్తి
తత్త్వమనుభూతి నిష్యంద తరుణమైన
పృధివి గగనమ్ము ముంచెత్తు వెలుగునిండి
కరిగె చీకట్లు తనివార కురిసె వాన చెట్లు పులకించె శాద్వల సీమ హరిత
లాస్యవేదికపై మధురాస్యలగుచు
ఆడె మందార హృదయమ్ము లల్లనల్ల
పూల ఎఱ్ఱని కాంతుల పూతలలమి
ప్రకృతి నవ ఋతూదయ జీవనకళనొప్ప
దివ్యభావాన తన్మయోద్వేగ పరవ
దెలిసినది నీవు నాలోనె వెలసితివని..
ఇంకాఉంది

- సాంధ్య శ్రీ 8106897404