రంగారెడ్డి

పత్తి తూకంలో దగాదగా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

షాద్‌నగర్ రూరల్, డిసెంబర్ 10: మధ్య దళారీలకు పత్తి విక్రయిస్తే మోసపోతున్నారని ప్రభుత్వం ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి వస్తే ధర్మ కాంటల తూకంలో మోసగిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతోకష్టపడి సాగుచేసిన పత్తిని విక్రయించుకోవాలన్న క్యూలైన్.. విత్తనాలు కొనుగోలు చేయాలన్నా క్యూలైన్ ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందోనని రైతులు అంటున్నారు. షాద్‌నగర్ వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన సీసీఐ కొనుగోలు కేంద్రానికి విక్రయించేందుకు పత్తిని తీసుకువస్తే రోజుల తరబడి వాహనాలతో క్యూలైన్‌లో నిలబడాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. రోజు కొద్ది వాహనాలను క్యూలైన్‌లో పెడితే రోజుకు వెయ్యికి చొప్పున వెయిటింగ్ చార్జీలు చెల్లించాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయని రైతులు అంటున్నారు. పత్తిని విక్రయించేందుకు సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, రోజుల తరబడి క్యూలైన్‌లో పెట్టుకొని ఎన్నో ప్రశ్నల వర్షం కరిపిస్తున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం, ఆధార్‌కార్డు, బ్యాంక్ పాస్‌పుస్తకం ఉంటే రైతు నుంచి త్వరగా పత్తిని కొనుగోలు చేయాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ స్థానిక సీసీఐ అధికారులు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామానికి చెందిన హరిశంకర్ అనే రైతు రెండు ఎకరాల 35గంటల వ్యవసాయ భూమిలో పత్తిపంటను సాగు చేశారు. మధ్య దళారీలకు విక్రయిస్తే సరిగ్గా డబ్బులు రావడం లేదని, తూకంలో మోసాలు చేస్తున్నారని భావించిన రైతు నేరుగా ఒక వాహనంలో పత్తిని నింపుకొని షాద్‌నగర్ సీసీఐ కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చారు. మూడు రోజుల పాటు మార్కెట్ యార్డులో వాహనం నిలపడమే కాకుండా తూకంలో భారీ మోసం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు ఎకరాల 35 గుంటల భూమిలో సుమారు 28 క్వింటాళ్ల పత్తి రావాల్సి ఉంది. ఇప్పటి వరకు తీసిన పత్తిలో సుమారు 20 క్వింటాళ్ల వరకు ఉంది. షాద్‌నగర్ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన తూకం ధర్మాకంట వద్దకు తీసుకువెళ్లి మూడు రోజుల తరువాత పత్తిని తూకం చేస్తే 14.80 క్వింటాళ్ల పత్తి మాత్రమే వచ్చిందని రైతు వివరించారు. సుమారు ఐదు క్వింటాళ్ల పత్తిని తాను నష్టపోయానని, తూకంలో భారీ మోసం ఉందని, ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మధ్య దళారీల వద్దకు వెళ్తే మోసం జరుగుతుందని అనుకుంటే సీసీఐ కొనుగోలు కేంద్రంలో సైతం అదే మోసం జరుగయతుందని రైతు వాపోయారు. ఎంతో కష్టపడి పంటను సాగుచేసి విక్రయించేందుకు తీసుకువస్తే ఇలా మోసం చేస్తారంటూ రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఫరూఖ్‌నగర్ మండలం కిషన్‌నగర్ గ్రామంలో రెండు ఎకరాల 35గంటల భూమిలో పత్తిపంట సాగుకు రూ.1.50లక్షలు ఖర్చు పెట్టామని, పత్తిని విక్రయించగా రూ.80వేలు వచ్చిందని రైతు హరిశంకర్ వివరించారు. అడుగడుగునా ఇలా మోసం చేస్తే తాము ఎలా జీవనం కొనసాగించాలని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పత్తిపంట సాగుచేస్తే బాగుంటుందని ఆశిస్తే చివరకు నిరాషే మిగిలిపోయిందని అంటున్నాడు. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పకడ్బంధీగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.