ఆంధ్రప్రదేశ్‌

అమరావతిపై మాట మార్చడం మోసమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, డిసెంబర్ 15: రాజధాని అమరావతి నిర్మాణం కొనసాగుతుందని అసెంబ్లీ సాక్షిగా మాట ఇచ్చి 24గంటలు గడవకముందే మంత్రి బొత్స సత్యనారాయణ మాట మార్చడం 5కోట్ల మంది రాష్ట్ర ప్రజలను అవమానపర్చడమే అవుతుందని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ అన్నారు. నిపుణుల కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే రాజధాని నిర్మాణంపై నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని ఆదివారం ఇక్కడో ప్రకటనలో విమర్శించారు. వైసీపీ అసత్య ప్రచారాలకు శాసనసభను వేదిక చేసుకోవడం సరికాదని, అసెంబ్లీ సాక్షిగా రాజధానిని జగన్మోహనరెడ్డి సమర్థించిన విషయం మరిచి రోజుకో ప్రకటన చేయడం సరికాదన్నారు. 13 జిల్లాల అభివృద్ధికి, యువతకు ఉపాధి కల్పించేందుకు దోహదపడే రాజధాని నిర్మాణానికి అడ్డుపడుతూ వైసీపీ నాయకులు చారిత్రక తప్పిదానికి పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. రాజధాని లేకుండా ఏ రాష్టమ్రైనా ఉందా? రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రాజధానితో సంబంధం ఉందనే విషయం ప్రభుత్వానికి తెలియదా అంటూ ప్రశ్నించారు. నవరత్నాల పేరుతో అధికారంలోకి వచ్చిన వైసీపీ నయవంచనకు పాల్పడిందని, హైకోర్టు తీర్పుతోనైనా భవనాలకు వైసీపీ రంగులు వేయడం మానుకోవాలని డిమాండ్ చేశారు. ప్రజలిచ్చిన అధికారాన్ని వారి శ్రేయస్సు, రాష్ట్భ్రావృద్ధికి వినియోగించుకోవాలే తప్ప ప్రజాధనాన్ని దుబారా చేయవద్దని సత్యప్రసాద్ హితవు పలికారు.