క్రీడాభూమి

సిరీస్‌పై కోహ్లీ సేన కన్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుణె: సొంతగడ్డపై శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌పై కోహ్లీసేన కనే్నసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా మొదటి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయన విషయం తెలిసిందే. ఇక ఇండోర్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత్ విజయం సాధించింది. అయతే నేడు జరిగే చివరి మ్యాచ్‌ను గెలిచి ఈ ఏడాది తొలి సిరీస్‌ను అందుకో వాలని టీమిండియా ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు గతేడాది పాకిస్తాన్‌పై శ్రీలంక యు వ జట్టు అద్భుత ప్రదర్శన చేసి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయగా, భారత్‌తో జరుగుతున్న సిరీస్‌లో సీనియర్ జట్టు చివరి మ్యాచ్ ను గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. అయతే ఇరు జ ట్ల బలాలను పరిశీలిస్తే భారత జట్టుకే విజయావకాశాలు ఎక్కు వగా కనిపిస్తున్నాయ. మరోవైపు ద్వైపాక్షిక సిరీస్‌లో గతంలో నూ శ్రీలంక పేలవ ప్రదర్శన చేసి, పరాయం ముట గట్టుకుంది.
ఎవరికీ ఛాన్స్..?
ఇదిలాఉంటే భారత జట్టులో ప్రస్తుతం యువకులకు అవకాశలివ్వడంపై జట్టు మేనేజ్ మెంట్ సందిగ్ధంలో పడింది. రిషభ్ పంత్ మినహా ఇ టీవల అవకాశాలిచ్చిన ప్రతీ ఆటగాడు సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో జట్టు మేనేజ్‌మెంట్‌లో అంతర్మథనం మొదలైంది. మరోవైపు ఈ ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ కోసం చివరి మ్యాచ్‌లో కొన్ని మార్పు లు చేయాల ని భావిస్తున్నట్లూ తెలుస్తోంది.
అయతే సంజూ శాంసన్, మనీష్ పాండేల మధ్య పోటీ నెలకొంది. దీంతో చివరి మ్యాచ్‌లో ఎవరిని బెంచ్‌కు పరిమితం చేస్తారనేది ఆసక్తిగా మారింది. అలాగే శివమ్ దూబే, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైనీ, వాషింగ్టన్ సుంద ర్‌లు కూడా అందివచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవ డంతో జట్టులో ఎవరికి చోటు దక్కుందనే దానిపై టీమ్ మేనేజ్‌మెంట్ డైలామాలో పడింది. ఏదేమైనా రానున్న టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని ప్రయోగాలు చేస్తారనేది స్పష్టంగా కనిపిస్తోంది.
జట్ల అంచనా..
భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శివమ్ దుబే, యుజువేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, నవదీప్ సైనీ, శార్దుల్ ఠాకూర్, మనీష్ పాండే, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్.
శ్రీలంక: లసిత్ మలింగ (కెప్టెన్), గుణతిలక, ఫెర్నాండో, ఎంజిలో మాథ్యూస్, శనక, కుశల్ పెరీరా, డిక్వెల్లా, ధనుంజయ డిసిల్వా, ఉదాన, రాజపక్స, ఒషాడ ఫెర్నాండో, హసరంగా, కుమార, కుశల్ మెండిస్, సందకన్, రజిత.
''చిత్రాలు.. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ
*ప్రాక్టీస్ సెషన్ లంక జట్టు