ఆంధ్రప్రదేశ్‌

తండ్రి నిర్ణయం.. తనయుడికి ఇరకాటం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జనవరి 21: ఎన్టీ రామారావు రద్దు చేసిన శాసనమండలికి మళ్లీ ప్రాణం పోస్తూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన పని నేడు ఆయన కుమారుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి ఇబ్బందిగా మారింది. తాను అనుకున్నట్లుగా మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ఆలోచనకు శాసనమండలి భారీ ఆటంకంగా మారింది. దీంతో తనను నమ్ముకున్న వారికి పదవులు ఇవ్వడానికి వీలుగా శాసనమండలిని పునరుద్దరించిన దివంగత నేత వైఎస్.రాజశేఖరెడ్డి చర్య ఇప్పుడు ఆయన కుమారుడు జగన్మోహన్‌రెడ్డికి ఇబ్బందికర పరిస్థితులను తెచ్చిపెట్టడం యాధృశ్చికమే అయినా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో శాసనమండలి వ్యవస్థ 1958లో మొదటిసారి ప్రారంభమైంది. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ అనంతరం రాష్ట్రంలో విధానపరిషత్‌ను 98 మంది సభ్యులతో 1958 జూలై 1వ తేదీన నాటి రాష్ట్రపతి ఆదేశాలతో ఏర్పాటుచేశారు. నాటి నుంచి 1985 వరకు మండలి కొనసాగింది. అయితే 1983లో రాష్ట్రంలో ఎన్టీ రామారావు నేతృత్వంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టింది. ఆయన అనుకున్న విధంగా అనేక బిల్లులకు శాసనమండలి ఆటంకంగా మారింది. దీంతో ఆయన శాసనమండలి రద్దు నిర్ణయం తీసుకున్నారు. రామారావు రద్దు నిర్ణయం తీసుకున్న నాటికి తెలుగుదేశం పార్టీకి మండలిలో ఒక్క సభ్యుడు లేడు. శాసనమండలిని రద్దు చేయాలంటూ 1984 మార్చిలో రామారావు శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. అయితే కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండటంతో శాసనమండలి రద్దు కాదని కాంగ్రెస్ నేతలు
భావించారు. అయితే నాడు ప్రధానిగా ఉన్న ఇందిరాగాంధీ హత్యకు గురికావడంతో మారిన రాజకీయ పరిణామాల నేపధ్యంలో 1984 అక్టోబర్ 31న రాజీవ్‌గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. రాష్ట్రాల్లో శాసనమండళ్లు ఆర్థిక భారమేనన్న భావనతో ఉన్న కారణంగా లోక్‌సభలో ఆంధ్రప్రదేశ్‌శాసన మండలి రద్దు బిల్లును ప్రవేశపెట్టిన రాజీవ్ దాన్ని ఆమోదించారు. ఆ తరువాత ఇతర అనుమతులు పొందడంతో 1985 మే 31న శాసనమండలి రద్దయింది. ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన 1989లో తిరిగి కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో నాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి మళ్లీ శాసనమండలిని పునర్దురించడానికి ప్రయత్నించారు. అయితే అది సాధ్యపడలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో 1985 నుంచి 2004 వరకు సుమారు 19 సంవత్సరాలు శాసనమండలి లేకుండా పరిపాలన కొనసాగింది. ఆ తరువాత 2004 మే నెలలో జరిగిన ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టడంతో మరో మారు శాసనమండలి పునరుద్దరణకు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో శాసనమండలిని పునరుద్ధరించాలని కోరుతూ 2004 జూలై 8వ తేదీ శాసనసభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపారు. దీనిపై లోక్‌సభలో చర్చించాలని 2004 డిసెంబర్ 16న కేంద్రం అనుమతిచ్చింది. చివరకు 2006 డిసెంబర్ 15న లోక్‌సభ ఆమోదించడంతో రాష్టప్రతి భవన్‌కు వెళ్లింది. రాష్టప్రతి అనుమతించడంతో రాష్ట్రంలో 2007 జనవరి 10వ తేదీ శాసనమండలి పునరుద్ధరణకు నోచుకుంది. నాటి నుంచి 13 సంవత్సరాలు కొనసాగిన శాసనమండలిలో నేటి వరకు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే విధంగా ఏ తీర్మానం లేకపోవడం విశేషం. శాసనమండలి ఏర్పాటైన తరువాత మొదటి ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి ఆ తరువాత ఐదేళ్లు తెలుగుదేశం పార్టీకి మండలిలో ఆధిక్యత ఉండటంతో ఇబ్బందులు రాలేదు. తాజాగా రాష్ట్రంలో మూడు రాజధానులు, నాలుగు జోన్లు ఏర్పాటు చేయాలని తలపెట్టిన వికేంద్రీకరణ బిల్లును ఆమోదింపజేసుకోవడంతో అధికార వైసీపీకి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి.
శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు చర్చకు రాకుండా టీడీపీ ఆర్టికల్ 71ని వినియోగించింది. దీనిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది. బిల్లుపై చర్చ జరుగకుండా శాసనమండలిలో ఆధిక్యత ఉన్న టీడీపీ చేసే ప్రయత్నాలు ఫలిస్తే వికేంద్రీకరణ బిల్లు ఆమోదానికి ఆటంకం కలుగుతుంది. దీంతో బిల్లు ఆమోదం కోసం అధికార పార్టీ నేతలు టీడీపీ సభ్యులను ఒప్పించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లు ఆమోదం పొందడానికి ప్రభుత్వానికి 30 మంది సభ్యుల బలం కావాల్సి ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అంత సులభతరం కాదు. అయితే రాజకీయాల్లో ఏమైనా జరుగవచ్చని విశే్లషకులు వెల్లడిస్తున్నారు. తమ ప్రయత్నాలకు టీడీపీ సభ్యుల నుంచి వచ్చే సమాధానం తరువాత శాసనమండలి రద్దుపై ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మండలిలో బలాబలాలు ఇలా ఉన్నాయి...
-----------------------------

తెలుగుదేశం 34
వైసీపీ 09
పీడీఎఫ్ 06
స్వతంత్రులు 03
బీజేపీ 02
కాంగ్రెస్ 01
ఖాలీలు 03
-------
మొత్తం 58
-------