Others

శ్రీకృష్ణార్జున యుద్ధం (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకృష్ణార్జున యుద్ధం. 1963లో జయంతి పిక్చర్స్ పతాకంపై విడుదలైన సినిమా. దర్శక పితామహుడు కెవి రెడ్డి నిర్మాణ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ అద్భుత కావ్యమంటే నాకు చాలా ఇష్టం. గయుడు అనే గంధర్వుడు పుష్పకయానం చేస్తుండగా తాను ఉమ్మిన తాంబూలం సంధ్యావందనం చేస్తున్న శ్రీకృష్ణుని దోసిలిలో పడుతుంది. దానికి ఆగ్రహించిన శ్రీకృష్ణుడు -గయుడిని సంహరిస్తానని శపథం చేస్తాడు. ప్రాణ భయానికి గురైన గయుడు నారదుని సలహాతో అసలు విషయం దాచి -అర్జునుడిని శరణు వేడతాడు. ప్రాణభయం లేదంటూ అర్జునుడు అభయమిస్తాడు. శపథాలు నిలబెట్టుకోవడం కోసం శ్రీకృష్ణార్జునుల మధ్య జరిగే యుద్ధమే -చిత్ర కథలోని ప్రధానాంశం. యన్టీఆర్, ఏయన్నార్, ధూళిపాళ, ముక్కామల, గుమ్మడి, నాగయ్య, బి సరోజాదేవి, ఎస్ వరలక్ష్మి, శ్రీరంజనివంటి లబ్ధప్రతిష్ట తారాగణం తమ అద్భుత నటనా కౌశలంతో చిత్రానికి జీవం పోశారు. పింగళి నాగేంద్రరావు సమకూర్చిన పాటలు, సంభాషణలు నేటికీ సజీవంగా వీనుల విందు చేస్తాయి. పెండ్యాల సంగీత సారథ్యంలో ‘అన్నీ మంచి శకునములే’, ‘అలిగితివా సఖీ’, ‘తపము ఫలించిన శుభవేళ’, ‘దేవ దేవ నారాయణ’, ‘మనసు పరిమళించెనే’ వంటి పాటలు ఎంతో ప్రాచుర్యం పొంది నాటికీ నేటికీ కోట్లాదిమంది సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. ఘంటసాల, మాధవపెద్దిల గాత్రంలోని మాధుర్యం ఇప్పటికే పాటలు విన్నవాళ్ల చెవుల్లో రింగుమంటుంది. తెలుగు సినిమాకు విశ్వవిఖ్యాత కీర్తినార్జించిన శ్రీకృష్ణార్జున యుద్ధం సినిమా తెలుగువారందరికీ గర్వకారణం. అలాగే ఔత్సాహిక దర్శక, నిర్మాత, రచయిత, సంగీత దర్శకులకు దిక్సూచిలాంటిది అనటంలో ఎలాంటి సందేహాలూ అక్కర్లేదు.
-సి ప్రతాప్, శ్రీకాకుళం