Others

మానవుడు దానవుడు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉషశ్రీ పిక్చర్స్ పతాకంపై శోభన్‌బాబు, శారద, రాజ్‌బాబు, సత్యనారాయణ, కృష్ణకుమారి, ముక్కామల ప్రధాన తారాగణంగా రూపొందిన మానవుడు-దానవుడు చిత్రం దాదాపు 40 ఏళ్ల క్రితం రూపొందిస్తే ఇప్పటికీ ఆ చిత్రంలోని పరిస్థితులు మన సమాజంలో కనబడుతుండడం విశేషం. మానవులందరూ దానవులుగా మారి నేడు జరుగుతున్న దిశ, నిర్భయ లాంటి సంఘటనలను గుర్తుచేస్తున్నారు. ఈ చిత్రంలో హీరో అక్క అటువంటి అకృత్యానికే బలైపోతుంది. చిన్నవాడైన హీరో పెద్దయ్యాక ఇటువంటి మానవ మృగాలను ఏరివేయడానికి దానవుడుగా మారతాడు. సినిమాలో విశేషమేమిటంటే మానవుడిగా మంచి వాడిగా కనిపించే డాక్టర్, రాత్రివేళల్లో మానవ మృగాలను వేటాడుతూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు ఇద్దరు శోభన్‌బాబులు ఉన్నారు అనుకుంటారు. దర్శకుడు చివరి దాకా ఇద్దరు ఉన్నట్లుగానే చూపిస్తాడు. కానీ క్లైమాక్స్‌లో మానవుడే దానవుడిగా మారి నిజమైన రాక్షసులను అంతమొందించాడు అని ముగింపు ఇస్తాడు. ఇలాంటి వ్యక్తులు ఇప్పటి సమాజంలో కనబడడం చాలా అరుదు. అలాంటి రోజులు మళ్లీ ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది. అణు అణువున వెలసిన దేవా కనువెలుగై మమ్ము కరుణించరావా, పచ్చని మన కాపురం పాలవెలుగై మరిగే పాలవెలుగై, నీకోసం... నీ సోకైన మగసిరికోసం నీకోసం, అమ్మాలాంటి చల్లనిది లోకమొకటి ఉందిలే ఆకలి ఆ లోకంలో లేనే లేదులే. జీవితంలో ఎన్నికలొస్తే కనె్నపిల్ల ఓటెయ్యమంటే ఎవరికయ్యా నీ ఓటు, అన్న అశ్వత్థామ సంగీతంలో రూపొందిన పాటలన్నీ ఆణిముత్యాలే. రెండు పాత్రల్లో వైవిధ్యాన్ని చూపుతూ నటించారు శోభన్‌బాబు. ఆయనకి జోడీగా శారద మంచి నటిగా నిరూపించుకుంది మరోసారి. రాజ్‌బాబు, ముక్కామల, సత్యనారాయణ, జయకుమారి, డబ్బింగ్ జానకి లాంటి వారు వైవిధ్యంగా నటించి మెప్పిస్తారు.
-తినె్నమీది సూరన్న, సింగనమల