బిజినెస్

రికార్డు సృష్టించిన గోధుమ ఉత్పత్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశవ్యాప్తంగా గోధుమ ఉత్ప త్తి ఏడాదికాయేడాది రికార్డు స్థాయిలో పెరుగుతోంది. 2019-20 పంటల సంవత్సరంలో గోధుమ దిగుబడి 106.21 మిలియన్ టన్నుల మేర ఉండవచ్చునని ఆశిస్తున్నారు. సకాలంలో రుతుపవనాల రాక, వర్షపాతం వల్ల ఎకరాకు గోధుమ దిగుబడి ఎప్పటికప్పుడు పెరుగుతోందని, ఈసారీ రికార్డు స్థాయిలోనే దిగుబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. 2018-19 పంటల సంవత్సరం (జూలై-జూన్) కూడా రికార్డు స్థాయిలో 103.60 మిలియన్ల మేర గోధుమ దిగుబడి సాధ్యమైంది. రబీ పంట కాలంలో అత్యధికంగా వేసేది గోధుమ పంట కాబట్టి వచ్చే నెల నుంచి పంట సాగు మొదలవుతుంది. దేశం లో ఆహార ధాన్యాల ఉత్పత్తికి సంబంధించిన రెండో అంచనాల నివేదికను వ్యవసాయ మంత్రిత్వ శాఖ మం గళవారం విడుదల చేసింది. జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో దేశవ్యాప్తంగా వర్షపాతం అంతకుముందు కంటే కూడా 10 శాతం ఎక్కువ ఉందని, దాని ఫలితంగా ఆ పంట కాలంలో వేసే పంటలన్నీ కూడా మామూలు కంటే ఎక్కువ దిగుబడినే ఇచ్చాయని పేర్కొంది. ఒక్క గోధుమే కాకుండా మిగతా అన్ని పంటల దిగుబడి కూడా అధికంగానే ఉన్నాయని ఈ నివేదిక తెలిపింది.