రంగారెడ్డి

ప్రగతి పథంలో పల్లెలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహేశ్వరం, పిబ్రవరి 25: దేశంలోని పల్లెలన్నీ ప్రగతిపథంలో నడిపించడానికి కేంద్ర ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఆదర్స్ సంసద్ యోజన పథకంలో భాగంగా రంగారెడ్డి జిల్లా కందుకూర్ మండలంలోని గుమ్మడవెళ్లి గ్రామ పంచాయతీని తాను దత్తత తీసుకున్నానని కిషన్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుమ్మడవెళ్లి దత్తత గ్రామంలో గ్రామసభ నిర్వహించి ప్రధాన సమస్యలపై అభిప్రాయాలు సేకరించారు. గుమ్మడవెళ్లి గ్రామాన్ని దేశంలోనే ఆదర్షదత్తత గ్రామంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజల ఆశీస్సులు పొందుతానని విశ్వాసం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు స్వర్ణ్భారతి ట్రస్ట్ నుంచి నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అన్నారు. కార్యక్రమంలో కందుకూర్ ఎంపీపీ మంద జ్యోతి పాండు, సర్పంచ్ గౌర ప్రభాకర్, ఎంపీటీసీ రేఖా బాబురావు, బీజేపీ నాయకులు అందెల శ్రీరాములు, బొక్క నర్సింహా రెడ్డి, కడారి జంగయ్య యాదవ్, బీ.పాపయ్య గౌడ్, అశోక్ గౌడ్, సాధ మల్లారెడ్డి, మాధవ చారి, కుండె వెంకటేష్ పాల్గొన్నారు.
పట్టణ ప్రగతి ఏదీ..
ప్రజల గోస పట్టదా?
* రామంతాపూర్‌లో మార్కెట్ కోసం బీజేపీ నేతల ధర్నా
ఉప్పల్, ఫిబ్రవరి 25: రామంతాపూర్ టీవీ కాలనీలో మార్కెట్ యార్డ్ నిర్మాణంలో పాలకుల నిర్లక్ష్య వైఖిరిని నిరసిస్తూ భారతీయ జనతా పార్టీ రామంతాపూర్, హబ్సిగూడ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం టీవీ కాలనీలో ధర్నా నిర్వహించారు. మార్కెట్ యార్డ్ కోసం అప్పటి ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్ చేతుల మీదుగా శిలాఫలకం వేసి రెండేళ్లు గడిచినా ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టకపోవడం ఎంతవరకు సమంజసమని డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్ రావు, కే.హరీష్ ధ్వజమెత్తారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు నోముల శాంతకుమార్, రవీందర్ రెడ్డి, శేఖర్ పాల్గొన్నారు.