ఆంధ్రప్రదేశ్‌

2017లోగా పాములేరు : యనమల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, ఏప్రిల్ 25: పోలవరం ఎడమ కాలువ, పాములేరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని 2017 సంవత్సరాంతానికి పూర్తి చేస్తామని ఆర్ధిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. ఈ ప్రాజెక్టుల ద్వారా పలు మెట్ట ప్రాంతాలను సాగు కిందకు తీసుకువస్తామని హామీయిచ్చారు. తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని విధాన గౌతమీ సమావేశ హాలులో ఉప ముఖ్యమంత్రి చిన రాజప్పతో కలసి యనమల సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షలో కరవుపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోందన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉన్నదని, అనుకున్న సమయానికే ప్రాజెక్టును జాతికి అంకితం చేసే ఆలోచనతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం మెట్ట ప్రాంతాలకు ఒక వరం కానున్నదని, ఈ ప్రాజెక్టు కింద అవసరమైన చోట్ల లిఫ్ట్‌లు ఏర్పాటుచేసి రైతులకు సాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. గోదావరి, ఏలేరు ఆయకట్టు ఆధునికీకరణ పనులు పెద్ద ఎత్తున చేపట్టి, వచ్చే సీజన్‌కు నీటి ఇబ్బందులు రాకుండా తగు చర్యలు తీసుకుంటామని యనమల హామీ ఇచ్చారు. నీటి పారుదలపై మే నెలలో రాష్టస్థ్రాయిలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి, సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించనున్నట్టు తెలియజేశారు. రాష్ట్రంలో 359 మండలాలను కరవు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఇందుకు ప్రతి జిల్లాకు రూ.3 కోట్ల వంతున కరవు నిధులు మంజూరు చేస్తున్నట్టు వివరించారు. మే నెల పూర్తయ్యే వరకు తాగునీటి సరఫరా సమస్య లేకుండా, ఫిర్యాదులు రాకుండా చూడాలని, ఉపాధి హామీ పనులను సమర్ధవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ మొదటి వారంలో రుతుపవనాలు వచ్చే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ ప్రకటించిందని, ఈ నెల రోజుల్లో కరవు సహాయ పనులను ముమ్మరంగా చేపట్టాలని ఆయన సూచించారు. రాష్ట్ర సరాసరి తలసరి ఆదాయం రూ.1.17 లక్షలు ఉందని చెప్పారు. ఈ ఏడాది 15 శాతం రెండంకెల వృద్ధి రేటు సాధించే దిశగా ప్రభుత్వం కృషిచేస్తోందని తెలియజేశారు. ఈ ఏడాది వృద్ధి రేటు సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలో తొలి స్థానం సంపాదించిందన్నారు.