ఆంధ్రప్రదేశ్‌

రాజ్యాంగ వ్యవస్థల్ని అవమానపర్చేలా ప్రకటనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 17: రాజ్యాంగ బద్ధమైన వ్యవస్థలను అవమానపరిచి, కించపరిచేలా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి వ్యాఖ్యలు చేయడం తగదని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. మంగళగిరి సమీపంలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీకి సీఎం కులాలను అంటగట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన అధికారం చేపట్టిన నాటి నుండి భర్తీ చేసిన ప్రభుత్వ పదవుల్లో ఎంతమంది తన సామాజిక వర్గం వారిని నియమించారో అందరికీ తెలుసన్నారు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెచ్చరికల నేపథ్యంలో ఎన్నికల కమిషనర్ స్థానిక సంస్థల ఎన్నికలను ఆరువారాలు వాయిదా వేయగా, ఆయన నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం ముఖ్యమంత్రికి ఎక్కడిదని ప్రశ్నించారు. రాజ్యాగంలోని ఆర్టికల్ 243-కే, 243-జడ్‌ను చదువుకుంటే రాష్ట్ర ఎన్నికల కమిషన్ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఏమాత్రం తక్కువ కాదని అర్థమవుతుందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్‌ల రూల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయని, వాటికి అనుగుణంగా పనిచేయకుండా వ్యతిరేకంగా పనిచేసే వారిపై చర్యలు తీసుకునే అధికారం కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన కేంద్ర సర్వీసులకు చెందిన అధికారుల వివరాలను సేకరించి డీఓపీటీకి పంపనున్నట్లు యనమల స్పష్టం చేశారు.