Others

భక్తకన్నప్ప (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఓం నమఃశివాయ’ అనే పంచాక్షరీ మహామంత్రాన్ని తెలిసి పఠించినా తెలియక పఠించినా ముక్తిపద సోపాన మార్గమే అవుతుంది. త్రిమూర్తులలో లయకారుడగు మహాదేవుని భక్తులు చాలామంది ఉన్నారు. పండిత పామరులు కూడా ఆ దేవదేవుని అనుసరిస్తారు. విద్యాగంధం లేని పాండిత్య ప్రకర్ష తెలియని అమాయకుడు, కోయగూడెంలో నివసించే తిన్నడి జీవిత కథనే -్భక్తకన్నప్పగా రూపొందించారు. కృష్ణంరాజు 70వ దశకంలో భక్తిరస పూరిత చిత్రంగా శివభక్తుని చరిత్రను వెండితెరపై ఆవిష్కరించారు. మహాభారతంలోని కిరాతార్జునీయంలోని అంశంతో మొదలైన ఈ చిత్రం దర్శకుడి ప్రతిభకు అద్దంపట్టింది. వాణిశ్రీ కథానాయికగా శ్రీ్ధర్, ప్రభాకర్‌రెడ్డి, రావుగోపాలరావు, సారధి, బాలయ్య, ఝాన్సి, జయమాలిని వంటి ప్రముఖులు ఈ చిత్రంలో నటించారు. సినారె, వేటూరి, ఆరుద్రవంటి లబ్ధప్రతిష్టులు రాయగా సత్యం సంగీతం సమకూర్పులో బాలు, జానకి, రామకృష్ణల గళాల్లో పాటలు వినసొంపుగా ఉంటాయి. గిరిజన గూడెంలో ఇద్దరు యువకులు ఓ అందాల రాశికోసం పోటీపడడం, లీల తిన్నడిని పెళ్లి చేసుకోవడం, గూడెం పెద్దలు ఆచారాలు, కట్టుబాట్లు తెలియజెప్పడం ఈ సినిమాలో బావుంటుంది. బాపు అపూర్వ సృష్టికి తార్కాణంగా అమ్మోరి విగ్రహం చూడొచ్చు. కృష్ణంరాజు కెరీర్‌లో ఇదొక మైలురాయిగా నిలిచిపోయింది. మిగిలిన వారికి కూడా ల్యాండ్‌మార్క్ చిత్రమే. శివుని ప్రార్థనా గీతం, ఆకాశం దించాలా, శివశివ శంకర భక్తవశంకర, శివశివ అన నేలరా కౌగిలిలోనే కైలాసముందిరా, ఎన్నియల్లో ఎన్నియల్లో చందమామ, శివ దండకం లాంటి పాటలు ప్రేక్షకులను అలరిస్తాయి. ముళ్లపూడి వెంకట మాటలు అద్భుతమనిపిస్తాయి. 1971లో విడుదలైన ఈ చిత్రం ఆర్థిక, హార్ధికపరంగా విజయం సాధించింది. సినీ అభిమానులకు ఓ మంచి చిత్రాన్ని చూశామనే ఆనందాన్ని మిగిల్చింది. శివరాత్రి పండుగ రోజున ప్రతి ఛానల్‌లోనూ ఏదో ఒక సమయంలో ప్రసారం అవుతోంది ఈ ప్రసిద్ధ చిత్ర రాజం.
-ఎల్ శ్రీనివాసరావు, అద్దంకి