Others

చక్కని చెక్కిళ్లపై చిరునవ్వు ఇలా...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెక్కిళ్లపై విరబూసే నవ్వే అందం. ముచ్చటైన నవ్వుకు చక్కనైన చెక్కిళ్లుండాలి. ముఖ సౌందర్యంలో చూడముచ్చటగా చెంపలు చోటుచేసుకోవాలి. వీటికి అందాలు కూర్చటానికి మార్కెట్‌లో ఎన్నో రకాల క్రీంలు, ప్యాకింగ్‌లు ఉన్నాయి. అయితే వాటి విషయంలో మెళకువగా లేకపోతే ఆరోగ్యకరమైన అందానికి బదులు చేటు జరిగే ప్రమాదమే ఎక్కువ. సహజ బ్యూటీమణులు కూడా అశ్రద్ధ చేస్తే చెక్కిళ్లు జిడ్డోడుతూ, మొటిమలతో బాధపడాల్సిందే. వీటికోసం వాడే కాస్మొటిక్స్, మాయిశ్చరైజర్స్, టోనర్స్ ఎక్కువగా వాడడంవల్ల డబ్బు వృధానే కాకుండా ఏమరుపాటు వహిస్తే సైడ్ ఎఫెక్ట్స్‌కి దారితీసే ప్రమాదం ఎక్కువ. మోముపై చిన్న మొటిమ వస్తే.. అమ్మాయిల కంగారు అంతా ఇంతా కాదు. వీటినుండి ముందు జాగ్రత్తపడితే చక్కని చెక్కిళ్ళు సొంతం కావడమే కాక మచ్చల సమస్యలు ఉండనే వుండవు మరి.
వీలైనన్నిసార్లు నోటినిండా గాలిని తీసుకుని బుగ్గలని ఉబ్బించండి. ఇలా చేయడంవల్ల కొద్ది రోజుల్లోనే అందం పరవళ్లు తొక్కే చెక్కిళ్లు మీ సొంతం అవుతాయి.
ప్రతిరోజు స్నానానికి ముందు కొబ్బరి నూనెతో చెంపలను మర్థన చేస్తుంటే త్వరలోనే చెక్కిళ్లు మృదువుగా మారతాయి.
ఎండలో తిరిగినపుడు చర్మం కమిలిపోయినట్టయితే పులిసిన పెరుగుమీద మీగడను చెక్కిళ్లకు పట్టించి కాసేపయ్యాక చల్లని నీటితో కడగడంవల్ల మంచి ఫలితం వుంటుంది.
మొటిమలు యుక్త వయసులో రావడం సహజం. వీటితో మానసికంగా కృంగిపోకుండా పులిసిన పెరుగుకు సమంగా శనగపిండిని చేర్చి మిశ్రమాన్ని పట్టిస్తే సరి.
చెంపలపై ఉన్న మొటిమలు, కురుపులు గిల్లడంవల్ల ఏర్పడిన నల్లని మచ్చలు మాయమవడానికి బచ్చలి ఆకులు, గులాబీ రేకులు పేస్టుగా చేసి పూయాలి. ఇలా చేయడంవల్ల కొద్దిరోజుల్లోనే చక్కని ఫలితం వుంటుంది.
ముఖంపై మృదువుగా, మెరుపులీనుతూ ఉండేందుకు వారానికొకమారైనా కొబ్బరినూనెతోగాని, నిమ్మరసంలో పెసరపిండిని కలిపిన మిశ్రమంతోగాని మసాజ్ చేసి కాసేపయ్యాక స్నానం చేయాలి.
తాజా పళ్లు, పచ్చని కూరగాయలు ఇతర న్యూట్రిషియన్ పదార్థాలే కాకుండా ప్రతిరోజు సుమారుగా ఎనిమిది గ్లాసుల మంచినీరు, మరో గ్లాసు ఫ్రూట్ జ్యూస్ తాగితే చర్మం కండరాలు మృదుత్వాన్ని బిగుతును కలిగి వుంటాయి.

- హర్షిత