రాశిఫలం 1-06-2016

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిథి: 
బహుళ ఏకాదశి సా.6.08
నక్షత్రం: 
రేవతి రా.7.33
వర్జ్యం: 
ఉ.8.21 నుండి 9.50 వరకు
దుర్ముహూర్తం: 
ఉ.11.36 నుండి 12.24
రాహు కాలం: 
మ.12.00 నుండి 1.30
మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1పా.) ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. ఆకస్మిక కలహాలకు అవకాశముంటుంది. ధననష్టాన్ని అధిగమించుటకు ఋణప్రయత్నం చేస్తారు.
వృషభం: 
(కృత్తిక 2, 3, 4పా., రోహిణి, మృగశిర 1, 2పా.) ధనలాభముంటుంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా వుంటుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. మనోల్లాసంతో కాలక్షేపం చేస్తారు.
మిథునం: 
(మృగశిర 3, 4 పా., ఆరుద్ర, పునర్వసు 1, 2, 3పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో అభివృద్ధి వుంటుంది. ఆత్మీయులను కలియుటలో విఫలమవుతారు. ఆందోళన చెందుతారు. వృధా ప్రయాణాలెక్కువగా ఉంటాయి. స్ర్తిల మూలకంగా ధనలాభముంటుంది.
కర్కాటకం: 
(పునర్వసు 4 పా., పుష్యమి, ఆశే్లష) అద్భుతమైన అవకాశాలను పొందుతారు. శుభకార్య ప్రయత్నాలు నెరవేరతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు అందుతాయ. అనుకోకుండా డబ్బు చేతికందుతుంది.
సింహం: 
(మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.) వృత్తి, ఉద్యోగ రంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలుంటాయి. ఏ విషయంలోను స్థిర నిర్ణయాలు తీసుకోలేకపోతారు.
కన్య: 
(ఉత్తర 2, 3, 4పా., హస్త, చిత్త 1, 2 పా.) దూర బంధువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
తుల: 
(చిత్త 3, 4పా., స్వాతి, విశాఖ 1, 2, 3పా.) ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ధననష్టమేర్పడే అవకాశముంది. ఆర్థిక ఇబ్బందులనెదుర్కొంటారు. అనారోగ్య బాధవలన బలహీనులవుతారు. అధికార భయం ఉంటుంది.
వృశ్చికం: 
(విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ) విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అనుకొన్న పనులు పూర్తిచేస్తారు.
ధనుస్సు: 
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.,) విదేశయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అనారోగ్య బాధలు అధికమవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. అనవసర వ్యయప్రయాసలుంటాయి.
మకరం: 
(ఉత్తరాషాఢ 2, 3,4పా., శ్రవణం, ధనిష్ఠ 1, 2పా.) ధనలాభముంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.
కుంభం: 
(్ధనిష్ఠ 3, 4పా., శతభిషం, పూర్వాభాద్ర 1,2, 3పా.) మానసికాందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకుంటారు. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలెదురవుతాయి. ఆరోగ్యం గూర్చి ప్రత్యేక శ్రద్ధ అవసరం.
మీనం: 
(పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి) తోటివారితో విరోధమేర్పడకుండా జాగ్రత్త వహించుట మంచిది. వ్యాపార మూలకంగా ధననష్టం కలిగే అవకాశాలున్నాయి. పరిస్థితుల పట్ల అనాసక్తితో వుంటారు.
Date: 
Wednesday, June 1, 2016
author: 
గౌరీభట్ల దివ్యజ్ఞాన సిద్ధాంతి