మెయన్ ఫీచర్

అక్రమ వలసలే అసలు సమస్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారతీయ జనతాపార్టీ మొట్టమొదటిసారిగా హిందీ రాష్ట్రాలనుంచి ఈశాన్య ప్రాంతాలకు విస్తరించింది. ఈ ప్రాంతంలోని అతిపెద్ద రాష్టమ్రైన అసోంలో పూర్తి మెజారిటీతో అధికార పగ్గాలను చేపట్టింది. ఈశాన్య ప్రాంతంలోని మిగిలిన ఆరు రాష్ట్రాల మొత్తం జనాభా కంటె అసోం జనాభా రెట్టింపుకంటె అధికం. టీ, ముడిచమురు, అడవులు, నీరు వంటి సహజవనరులు సమృద్ధిగా ఉన్న రాష్ట్రం కూడా. తొలిసారి అధికారాన్ని చేపట్టిన సర్వానంద సోనోవాల్ ముందు ఇప్పుడున్న అతిప్రధానమైనది అక్రమ వలసల సమస్య. 1993లో ఒకసారి నేను కోల్‌కతాను సందర్శించడం తటస్థించింది. అప్పట్లో తూర్పు సైనిక కమాండర్ జమీల్ మహమ్మద్‌ను కలుసుకోవడం తటస్థిం చింది. గతంలో నేను పశ్చిమ విభాగ సైనిక కమాండర్‌గా పనిచేసిన కాలంలో మేం ఇద్దరం కలిసి పనిచేసాం. అప్పట్లో ఆయన పంజాబ్‌లోని ఒక బ్రిగేడ్‌కు కమాండర్‌గా పనిచేసేవారు. మాఇద్దరి మధ్య జరగిన సంభాషణల్లో, అస్సాంలోకి బంగ్లాదేశ్ నుంచి తీవ్రస్థాయిలో కొనసాగుతున్న చొరబాట్ల గురించి ప్రస్తావన వచ్చింది. ఇదేవిధంగా ఇవి కొనసాగితే దిగువ అసోంలోని ధుబ్రి ప్రాంతం భవిష్యత్తులో మరో కశ్మీర్ మాదిరిగా మారడం తథ్యమన్న ఆందోళనను ఆయన వ్యక్తం చేశారు.
ఈశాన్య రాష్ట్రాలను భారత ప్రధాన భూభాగంతో కలుపుతున్న అత్యంత ఇరుకైన భాగం ధుబ్రి. ఆయా రాష్ట్రాల ప్రజలు భారత్‌లోకి ప్రవేశించాలంటే ఇది మాత్రమే మార్గం. అప్పట్లో నాకు దీనిగురించి నాకు తెలిసింది చాలా స్వల్పం. కానీ తర్వాతి కాలంలో ఈ సమస్యపై చాలా లోతుగా అధ్యయనం చేశాను. బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లు పతాకస్థాయికి చేరిన 1997 సంవత్సరంలో అప్పటి భారత ప్రధాని, ఐ.కె.గుజ్రాల్ నన్ను అసోం గవర్నర్‌గా నియమించారు. 1998 నాటికి అక్రమ చొరబాటుదార్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. రాష్ట్రంలోని మొత్తం 126 నియోజకవర్గాలుండగా, వాటిల్లో 40 స్థానాల్లో వారిదే మెజారిటీగా ఉండటమో, లేక మెజారిటీకి దగ్గరగానో లేదా నిర్ణాయక స్థితిలోనో ఉండటమో నెలకొని ఉన్న పరిస్థితి. ఇదే సమయంలో భద్రతా కోణంలో కూడా ఈ చొరబాటుదార్ల వల్ల పెను సమస్యలు ఉత్పన్నం కాగలవన్నది అర్థం చేసుకోవ డానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఎప్పటికైనా వీరివల్ల దేశానికి ముఖ్యంగా ఈ ప్రాంతానికి భద్రత పెనుసమస్యగా మారుతుందన్న సంగతి బాగా అర్థమైంది.
అసోంలో ఒకప్పుడు దేవకాంత్ బారు వా హవా నడుస్తుండేది. ‘‘ఇండియాయే ఇందిర, ఇందిరే ఇండియా’’ అనే నినాదం పతాకస్థాయిలో ప్రచారంలో ఉన్న సమయంలో ముఖ్యంగా 1975-77 మధ్యకాలంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగారు. ‘అలీ’, ‘కూలీ’..ఇద్దరూ అండగా ఉంటే కాంగ్రెస్‌కు ఎన్నటికీ అసోంలో తిరుగులేదని దేవకాంత్ బారువా అంటుండేవారు. ఇక్కడ ‘అలీ’ అంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా అసోంలోకి వలస వచ్చిన ముస్లింలని, ‘కూలీ’ అంటే స్థానిక హిందువులని అర్థం. దేవకాంత్ బారువా ఫార్ములా విజయవంతమైంది. అసోంలో కాంగ్రెస్ అధికారపగ్గాలు చేపట్టింది. అప్పట్లో అస్సాం గవర్నర్‌గా బి.కె. నెహ్రూ ఉండేవారు. ఆయన ఇందిరాగాంధీకి వరుసకు సోదరుడు. ఇక బి.పి. ఛాలిహా అనే వృద్ధ కాంగ్రెస్ నేత అసోంకు ముఖ్యమంత్రిగా ఉన్నారు. బంగ్లాదేశ్ నుండి విపరీతంగా కొనసాగుతున్న వలసలను నియంత్రించకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనాల్సి ఉంటుందని వీరిద్దరూ కేంద్రానికి సిఫార్సు చేశారు. అయితే కాంగ్రెస్ అధిష్ఠానం వీరి మాటలను పట్టించుకోకపోవడమే కాదు, అనవసరంగా ఇందులో కలుగజేసుకోవద్దంటూ హెచ్చరించింది. ‘‘పాత కాంగ్రెస్ జాతీయ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇవ్వగా, ప్రస్తుతం కాంగ్రెస్ అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తోంది,’’ అని బికె నెహ్రూ తన ఆత్మకథలో ఆవేదనతో రాసుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను నిరోధించేందుకు అమల్లోకి తెచ్చిన ‘‘ఇల్లీగల్ మైగ్రేషన్ డిటెక్షన్ బై ట్రిబ్యునల్ యాక్ట్’’ (ఐఎండిటి)వాస్తవంలో, బంగ్లాదేశ్ నుంచి వలసలను ప్రోత్సహించడానికే ఉపయోగపడిందంటే అతిశయోక్తి కాదు.
అసోం గవర్నర్‌గా వెళ్లిన తర్వాత ఈ సమస్యపై తీవ్రంగా పరిశోధించడమే కాదు, రాష్ట్రంలోని రాజకీయ నేతలు, మేధావులతో విస్తృతంగా చర్చలు జరిపాను. మొత్తం 26 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా వాస్తవ పరిస్థితిపై రహస్యంగా సమాచారాన్ని సేకరించాను. సరిహద్దులోని ప్రతి సైనిక పోస్టును జీపులో తిరుగుతూ సందర్శించాను. బ్రహ్మపుత్రా నదీ సరిహద్దును కూడా పరిశీలించాను. ఈ విస్తృత పరిశోధన తర్వాత, అక్రమ వలసలపై 42 పేజీల నివేదికను తయారుచేసి రాష్టప్రతికి నివేదించాను. దీనికి సంబంధించిన కాపీలను ప్రధానమంత్రి, అసోం ముఖ్యమంత్రులకు కూడా పంపాను. ఇందులో మొత్తం 14 సిఫారసులున్నాయి. ఫెన్సింగ్ నిర్మాణం, పౌరుల పేర్లతో జాతీ య రిజిస్టర్‌లో నమోదు చేయడం, అక్రమంగా వలస వచ్చిన వారిని గుర్తించడం, ఐఎండిటి చట్టాన్ని రద్దు చేయడం వంటివి సిఫార్సుల్లో కొన్ని. ఈ నివేదిక పూర్తి పాఠం అప్పట్లో అసోంలోని అన్ని ప్రతికల్లో ప్రచురితమైంది. ఇప్పటికీ ఈ నివేదికను చాలామంది రిఫరెన్స్‌గా వాడుకుంటున్నారు.
ఈ నివేదికను సమర్పించిన నేపధ్యంలో అప్పటి రాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో 14 మంది, నన్ను రీకాల్ చేయాల్సిందిగా రాష్టప్రతికి లేఖ రాశారు. ముఖ్యంగా గవర్నర్ రాజకీయ అంశాల్లో అనవసరంగా తల దూరుస్తున్నారని వారు తమ లేఖలో ఆరోపించారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్‌డిఎ ప్రభుత్వం ఈ నివేదికలోని అభిప్రాయాలతో పూర్తిగా ఏకీభవించింది. ఐఎండిటి చట్టంపై కూటమిలోని సహచర పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడం, రాజ్యసభలో మెజారిటీ లేకపోవడంతో నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వం ఏమీ చేయలేకపోయింది. నాటి అసోం ముఖ్యమంత్రి ప్రపుల్లకుమార్ మహంతా నేను సమర్పించిన నివేదికలోని సిఫార్సులకు పూర్తి మద్దతు ప్రకటించారు. చాలా ఉత్సాహంగా వాటిని అమలు పరచేందుకు ముందుకు వచ్చారు కూడా. అయితే ఆయన ఆ పని చేయలేకపోయారు. దానికి కారణం కూటమిలోని తన సహచర పార్టీ ఆయా చర్యలను వ్యతిరేకించడమే. తర్వాత తరుణ్ గొగోయ్ అధికారంలోకి వచ్చారు. నాకు ఆయనతో మంచి సంబంధాలే ఉన్నాయి. దాదాపు అన్ని అన్ని అంశాల్లో మా ఇద్దరి అభిప్రాయాలు ఒక్కటే. ఒక్క అక్రమ చొరబాట్ల విషయంలో తప్ప. వలసల విషయంలో మా ఇద్దరి మధ్య తీవ్ర విభేదాలున్నాయి. చివరిగా అక్రమ వలసలపై గవర్నర్ తన అభిప్రాయాలు వ్యక్తం చేయకుండా కళ్లెం వేయాలంటూ గొగోయ్ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. చివరకు నేను 1998లో రాష్టప్రతికి సమర్పించిన నివేదికలోని అంశాలను అమలు చేయడానికి ఏవిధమైన చర్యలు తీసుకోలేదు.
సర్వానంద సోనోవాల్ ఆల్ ఆస్సాం స్టూడెంట్స్ యూనియన్‌కు అధ్యక్షుడిగా ఉండేవారు. మేమిద్దరం ఎప్పుడూ పరస్పరం సంప్రదించుకుంటుండే వాళ్లం. ఆయన ఈ అక్రమ వలసల సమస్యను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తన ఫిర్యాదుతో పాటు రాష్టప్రతికి నేను సమర్పించిన సిఫారసుల కాపీని కూడా జతపరచారు. ఆ నివేదికలో పేర్కొన్న ఒక అంశాన్ని ఉటంకిస్తూ కోర్టు ఐఎండిటి చట్టాన్ని కొట్టివేసింది. ఈ సమస్యను ఎదుర్కొనడానికి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందేమీ లేదు. అసలు వలసలు సమస్యే కాదంటూ తరుణ్‌గొగొయ్ కొట్టిపారేస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి సోనొవాల్ ఈ బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసల సమస్యను రెండేళ్ల కాలంలో పరిష్కరిస్తామని చెబుతున్నారు. మరీ అంతకాలం అవసరమా? అంతటి సుదీర్ఘకాలాన్ని గడువుగా పెట్టడంలో అర్థం లేదు. మొత్తం రెండు దేశాల మధ్య 242 కిలోమీటర్ల సరిహద్దు పొడవునా కంచెను ముఖ్యంగా రెండులైన్ల కంచెను నిర్మించడానికి కేవలం మూడు నెలల వ్యవధి చాలు. కాశ్మీర్ సరిహద్దులో, పర్వతాలతో కూడి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా సైన్యం మొత్తం 700 కిలోమీటర్ల కంచె నిర్మాణాన్ని కేవలం ఏడాది కాలంలో పూర్తి చేసిందన్న సంగతి ఇక్కడ గుర్తుం చుకోవాలి.
బంగ్లాదేశ్‌లో ఐఎస్‌ఐఎస్ ఉగ్రవాదులు ఎంతో చురుగ్గా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. బంగ్లా వలసలు ఇదేమాదిరి కొనసాగడం భద్రతాపరమైన పలు సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల భారత్- బంగ్లాదేశ్‌ల మధ్య కంచె నిర్మాణం చేపట్టడం భద్రతా చర్యలపరంగా అతి కీలకమైన అంశం. ఇప్పటి వరకు రాష్ట్రంలో స్థిరపడిన బంగ్లాదేశ్‌కు చెందినవారిని తిరిగి తమ స్వదేశానికి పంపడం చెప్పినంత తేలికైన విషయం కాదు. గుర్తించిన అక్రమ వలస ప్రజలను ఏదేశానికి చెందని పౌరులుగా పరిగణించి, స్థిరాస్తులను ఏర్పాటు చేసుకోవడానికి లేదా ఎన్నికల్లో ఓటు చేసే హక్కులు లేకుండా అలాగే ఉండనివ్వాలి. 1947లో పశ్చిమ పాకిస్తాన్ నుంచి జమ్ముకు వలస వచ్చిన ముస్లిమేతర ప్రజలను ఇప్పటి వరకు ఇదేమాదిరిగా పరిగణిస్తున్నారు. ఆవిధంగా చేయడం వల్ల కాషాయ అణచివేత అనే ఆరోపణలనుంచి బయటపడవచ్చు.
పౌరుల జాతీయ రిజిస్టర్‌ను వర్తమాన పరిస్థితులకనుగుణంగా మార్పులు చేర్పు లు చేయాలి. దేశ ప్రజలుగా గుర్తించిన వారికి గుర్తింపు కార్డులను ఇవ్వాలి. ఈ కార్యక్రమం సాధ్యమైనంత త్వరగా పూర్తి కావాలి. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో, బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వలస వచ్చిన ముస్లింల ఓట్లు ఎఐడియుఎఫ్, కాంగ్రెస్‌ల మధ్య చీలిపోయాయి. అసోంకు చెందిన చాలామంది ముస్లిం ఓటర్లు భాజపాకే తమ మద్దతు తెలిపారు. 1998లో నివేదికను తయారుచేసిన సమయంలోనూ చాలామంది స్థానిక ముస్లింలు అక్రమ వలసలకు వ్యతిరేకంగానే తమ అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. అప్పట్లో ఈ నివేదికను మతతత్వంతో కూడినదంటూ కొందరు విమర్శించారు. అక్రమ వలసలనేది జాతీయ సమస్య, మతపరమైన సమస్య కాదు.

-ఎస్.కె. సిన్హా