Others

మన హీరోలున్నారే..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వేసే ప్రతి అడుగూ ఆచితూచి వేయాలంటారు మన పెద్దవాళ్లు. పొరబాటు జరిగితే పాతాళానికి పోవడం ఖాయమన్నది -వాళ్లు చెప్పే మాటలోని హెచ్చరిక. ఈ హెచ్చరికలు మన స్టార్ హీరోలకు పట్టడం లేదు. ఎన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పాతాళానికి దిగజారిపోయనా.. మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తూ దెబ్బలు తింటూనే ఉన్నారు.
తెలుగు సినిమా హీరోలు కొన్ని తప్పటడుగులు కారణంగా హైలెవెల్‌లో ఉన్న రేంజ్ ఒకసారిగా దిగజారుతోన్న పరిస్థితి ఇటీవలి కాలంలో మరీ ఎక్కువ కనిపిస్తోంది. తాజా ఉదాహరణ ‘బ్రహ్మోత్సవం’. ‘శ్రీమంతుడు’లాంటి బ్లాక్ బస్టర్‌తో హైరేంజ్‌కు వెళ్ళిన మహేష్, ఏడాది తిరగకుండానే కిందకు వచ్చేశాడు. శ్రీమంతుడి ఆనందం ఏడాది తిరిగేసరికి ఆవిరైపోయంది. తాజాగా ఎంచుకున్న కథ, చెప్పిన డైలాగ్, వేసిన డాన్స్ ఏదీ తన రేంజ్‌ని నిలబెట్టలేకపోయాయ. పైగా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంతకుముందు ‘పోకిరి’, ‘బిజినెస్‌మాన్’లాంటి చిత్రాలతో టాప్‌రేంజ్‌కు వెళ్ళిన మహేష్, ‘వన్’ చిత్రంతో ఢమాల్‌మని కిందపడ్డాడు. ఇప్పుడు బ్రహ్మోత్సవంతో మళ్లీ అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. ఒక్క తప్పటడుగు మహేష్ ఊపునకు బ్రేకులు వేసేసింది. ఈ దెబ్బనుంచి కోలుకోవడం అంత ఈజీ కాదు. గతంలోనూ మహేష్ చేసిన ‘నానీ’, ‘ఖలేజా’, ‘టక్కరిదొంగ’ చిత్రాలు తప్పటడుగుల్లాంటివే.
అలాగే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ వేసిన తప్పటడుగులు అన్నీ ఇన్నీ కావు. ‘జానీ’ సినిమా కథ తనే రాసుకుని తానే దర్శకత్వం చేపట్టాడు. ఆ సినిమా ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ మిగిల్చింది. తర్వాత ‘గుడుంబా శంకర్’, ‘బాలు’, ‘బంగారం’ చిత్రాలూ నిరాశనే మిగిల్చాయ. ‘పులి’, ‘పంజా’లాంటి కథ కుదరని చిత్రాలతోనూ పవర్‌స్టార్ ఇమేజ్ మసకబారింది. చాలా గ్యాప్ తరువాత పడిన ‘గబ్బర్‌సింగ్’, ‘అత్తారింటికి దారేది’ సినిమాలతో మళ్లీ తన పవరేమిటో చూపించాడు పవన్. ఒకప్పుడు ‘రాంబాబు’తో వేసిన తప్పటడుగు విమర్శల బాంబులు కురిపిస్తే, మళ్ళీ దర్శకత్వమంటూ ‘సర్దార్’ని భుజానికెత్తుకుని మరింత విమర్శలకు గురయ్యాడు. తనదైన స్టయలిష్ డ్యాన్స్‌లతో మంచిపేరు తెచ్చుకున్న పవన్, ‘సర్దార్’లో చేసిన డ్యాన్స్ కారణంగానే ఇమేజ్‌ని డామేజ్ చేసుకున్నాడు. తెలుగు సినిమాలో ఎక్కువ తప్పటడుగులు వేసింది నందమూరి బాలకృష్ణ. ‘పల్నాటి బ్రహ్మనాయుడు’ సినిమా విడుదలకు ముందు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. సుమోలు, బైక్‌లు, పడవలమీద పోస్టర్స్‌తో విడుదలకు ముందు హైప్ కనిపించింది. సినిమా రిలీజయ్యాక మొత్తం ఫేట్ మారిపోయింది. అందులో తొడగొడితే ట్రైన్ వెనక్కివెళ్లడం, కోళ్లన్నీ కలిసి ఫైట్ చేయడం, తొడగొడితే కుర్చీ రావడం లాంటి సన్నివేశాల్లో సీరియస్‌నెస్ కాస్తా కామెడీగా మారడంతో -బాలయ్య కెరీర్ కూడా కామెడీ ట్రాక్ అయపోయంది.
‘విజయేంద్రవర్మ’లో ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్, ‘మిత్రుడు’ చిత్రంలో కరెంట్‌షాక్ సన్నివేశం, ‘మహారథి’ చిత్రంలో శ్రుతిమించిన ఓవర్ యాక్షన్ ఎపిసోడ్లు బాలయ్య కెరీర్‌ను మసకబార్చాయ. ‘ఒక్కమగాడు’ సినిమా రిలీజ్‌కుముందు చాలా హంగామా చేశారు. రిలీజయ్యాకగానీ వాస్తవ తప్పిదమేంటో తెలిసిరాలేదు. ఒక్కమగాడు చూస్తున్నంత సేపూ కమల్‌హాసన్ నటించిన భారతీయుడు సినిమా గుర్తుకురావడం, కథంతా ఏటో వెళ్లకపోవడం, క్లైమాక్స్ ఎబ్బెట్టుగా తోచడంతో ఫ్యాన్స్ సైతం ఉసూరుమన్నారు. ఇలాంటి పరిస్థితిలలో ‘సింహా’ సినిమా బాలయ్య కెరీర్‌ని పెద్ద మలుపు తిప్పింది. తరువాత వచ్చిన ‘లెజెండ్’ కెరీర్ ఫేట్‌నే మార్చేసింది.
విక్టరీ వెంకటేష్ కెరీర్‌లో ప్లాప్‌లు తక్కువే అయనా, డామేజీలు ఎక్కువే ఉన్నాయ. ‘చిన్నబ్బాయి’, ‘పోకిరిరాజా’, ‘ప్రేమతోరా’, అలాగే ‘సుభాష్‌చంద్రబోస్’ లాంటి చిత్రాలు వెంకటేష్ ఎంచుకోతగ్గ కథలు కాదని తేల్చేశారు. ఆ సినిమాలను తిప్పికొట్టారు. అలాగే ‘మసాల’ సినిమా కూడా వెంకీ అభిమానులను నిరుత్సాహపర్చింది. ‘గోపాల గోపాల’, ‘దృశ్యం’ చిత్రాలతో వెంకీ మళ్లీ ఫామ్‌లోకి రాగలిగాడు.
కింగ్ నాగార్జున ప్రయోగాలకు ఎప్పుడూ సిద్ధమేకానీ ఈ ప్రయోగాలే ఆయన కెరీర్‌నూ ఒకింత ఒడిదుడుకులకు గురిచేశాయ. నాగ్ కెరియర్‌లో అత్యంత దయనీయమైన సినిమా ‘్భయ్’. ఈ విషయాన్ని నాగార్జున కూడా బహిరంగంగానే ఒప్పుకున్నాడు. ‘్భయ్’ సినిమా తీసి ఉండాల్సింది కాదని, అలాగే ‘కేడి’, ‘కృష్ణార్జున’, ‘స్నేహమంటే ఇదేరా’లాంటి సినిమాలు తన కెరీర్‌లో పడిన తప్పటడుగులేనని ఆయనే అంగీకరిస్తాడు. అయతే, ఫెయల్యూర్స్‌ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేస్తూనే ఇండస్ట్రీలో హిట్స్ కొట్టాడు నాగ్. తాజాగా ‘మనం’, ‘ఊపిరి’, ‘సోగ్గాడే చిన్నినాయనా’ లాంటి కథలను ఎంచుకోవడంలో నాగార్జున అనుభవం కనిపిస్తుంది. వరుస హిట్లు కొడుతూనే, ప్రయోగాలు హీరోగా ముద్రవేయించుకున్నాడు. ఇప్పుడు ‘ఓం నమో వెంకటేశాయ’తో మరో ప్రయోగానికి సిద్ధమయ్యాడు.
హీరో రవితేజ తప్పటడుగులూ చెప్పలేనన్ని. అందులో ‘చంటి’, ‘నిప్పు’, ‘కిక్-2’లను చెప్పుకుంటే, జూ.ఎన్టీఆర్‌కు ‘నా అల్లుడు’, ‘నరసింహుడు’, ‘ఆంధ్రావాలా’ లాంటి చిత్రాలు కెరియర్‌కు షాక్ నిచ్చినవే. ‘నాగ’ సినిమా రాజకీయాలకు పనికొస్తుందనుకుంటే, తుస్సు మంది. మరి ముఖ్యంగా చెప్పాల్సింది ‘శక్తి’. ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోని బిగ్గెస్ట్ డిజాస్టార్. ఏ1 స్టార్‌గా ఎదిగే అవకాశం ఉన్న సమయంలో ఈ సినిమా చేసి చేజేతులా చాన్స్ వదులుకున్నాడు. ఐదుగురు రచయితలు పనిచేసినా ఈ సినిమాని ఎవ్వరూ రక్షించలేకపోయారు. ‘కంత్రీ’, ‘దమ్ము’, ‘ఊసరవెల్లి’ చిత్రాలూ స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టలేకపోయాయి. ‘రభస’, ‘రామయ్య వస్తావయ్యా’ సినిమాలూ కొత్త వెలుగు ఇవ్వలేకపోయాయ. ఇటీవల వచ్చిన ‘టెంపర్’, ‘నాన్నకుప్రేమతో’ సినిమాలు ఎన్టీఆర్‌ని నిలబెట్టేందుకు మాత్రమే ఉపయోగపడ్డాయ. ఇప్పుడు ‘జనతా గ్యారేజ్’ ఇండస్ట్రీ హిట్ అన్న ప్రచారం జరుగుతుంది. హీరోలు తప్పటడుగులు వేయడానికి ప్రధాన కారణం దర్శకులని గుడ్డిగా నమ్మడం. వాళ్లు చెబుతున్నది రైటా? రాంగా? ఇది ప్రేక్షకులకి చేరువవుతుందా? నవ్వులపాలు చేస్తుందా? అని ఆలోచించకపోవడం. అలాగే మొత్తం కథ లేకుండా పాయింట్‌తో సినిమా ప్రారంభించడం, తర్వాత తలలు పట్టుకోవడం ఇండస్ట్రీలో ఆనవాయితీగా వస్తున్న ఆచారం.
దర్శకులు సింగిల్ పాయింట్‌తో సినిమాలు చేసేస్తున్నారు. చూపించేసిన పాయంట్‌తోనే మళ్లీ సినిమా తీసేస్తే హీరోలకి హిట్లెలా పడతాయ. తమిళ, కన్నడ, మలయాళం, హిందీవాళ్లు సినిమా సినిమాకీ భిన్నంగా ఆలోచించడం, పోలికలు లేకుండా చూసుకోవడంతో హిట్లు పడుతున్నాయి. ఈ అనుభవాలతోనైనా మన హీరోలు పెర్‌ఫెక్ట్ స్క్రిప్ట్‌తో సినిమాలకు అంగీకరిస్తారో, తప్పటడుగులు మళ్లీ మళ్లీ వేస్తారో చూడాలి.

-నల్లపాటి సురేంద్ర