రివ్యూ

..హోల్డాన్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాగోలేదు -- రైట్ రైట్

తారాగణం:
సుమంత్ అశ్విన్, పూజాజవేరి, ‘బాహుబలి’ ప్రభాకర్, నాజర్, పావని గంగిరెడ్డి, రాజ్యలక్ష్మి, జీవా, ధన్‌రాజ్, తాగుబోతు రమేష్, సుధ, అనంత్, గౌతమ్‌రాజు, షకలక శంకర్
సంగీతం: జెబి
నిర్మాత: జె వంశీకృష్ణ,
దర్శకత్వం: మను

చేయని తప్పుకు నింద పడటం, తద్వారా జైలుపాలు కావడం, తిరిగి అసలు దోషి ఎవరో తెలియజెప్పడం వంటి కథాంశంతో తెలుగులోనే గతంలో అనేక చిత్రాలు వచ్చాయి. మరి ఇంతటి ‘ఆర్డనరీ’ స్టోరీ లైన్‌తో మలయాళంలో నిర్మించిన (అన్నట్టు ‘రైట్ రైట్’ చిత్రానికి మాతృక అయిన చిత్రంపేరు ‘ఆర్డనరీ’ కావడం గమనార్హం) దానికి తెలుగు రీమేక్‌గా ‘రైట్ రైట్’ను వదలడం ఎంత ‘రాంగో’ అనిపించింది. ఇక మిగతా వివరాల్లోకి వెళ్తే..
ఖాకీ యూనిఫారంపై మోజుతో పోలీసు అధికారి కావాలనుకునే ఇ.రవి (సుమంత్ అశ్విన్) వాస్తవ జీవితంలో ఒక కండక్టర్ అవుతాడు. ప్రథమ పోస్టింగ్‌గా రోజుకు ఒకే ట్రిప్పు నడిచే కొండ ప్రాంతానికి వెళ్లే ఏరియా బస్‌కు రవిని వేస్తారు. ఆ బస్‌కు శేషు (బాహుబలి ప్రభాకర్) డ్రైవర్. ఇతను మద్యపాన ప్రియుడు. ఆ వ్యసనంలో ఒకసారి బస్ నడపలేని స్థితిలో వుంటే రవే బస్ నడుపుతాడు. అపుడు ఆ వూళ్లోని విశ్వనాథం మాస్టారు కొడుకు దేవా ప్రమాదకర గాయాలతో బస్సుకు గుద్దుకుని పడి వున్నట్టు వుంటాడు. అతని స్థితి చూసి హాస్పటల్‌కు పంపుతారు రవి, శేషు. అయితే అనంతరం అతని డెడ్‌బాడీ లోయలో దొరకడం, ఆ నేరంపై రవి జైలుపాలు కావడం జరుగుతుంది. అతన్ని అసలు చంపిందెవరు? ఎందుకు? అన్న అంశాల నిరూపణ మిగతా భాగం. ఈపాటికే ఈ బాపతు నిందలు, తిరిగి వాటినుంచి తప్పించుకుని క్లీన్‌చిట్‌తో వచ్చిన కథానాయకుల కథలు చూసిన మనకు ఇందులో కనీసం కథనంలోనైనా కొత్తదనం కనపడిందా? అంటే అదీ శూన్యం. అసలు సినిమా ఇంట్రవల్ స్టేజి వచ్చేవరకూ గమ్యం ఏమిటో మనకు అర్థంకాదు. పాత్రల ఎస్టాబ్లిష్ పేరిట బస్ గవిటి రావడం అక్కడ వుండటం, బస్ దిగగానే డ్రైవర్ బాబు ముందు బాచవడం వంటివి చూపడంతోనే సరిపోయింది. ఇక మిగిలిన సగం దోషెవరో తెలపడంకోసం కసరత్తు చేశారు. అదీ చాలా పేలవంగా, హాస్యాస్పదంగా ఉంది. ఉదాహరణకు గాయపడిన దేవాను పంపిన వాహనం డ్రైవర్ సంఘటన జరిగిన నాటినుంచి కనిపించకపోవడంతో అతని గురించి హీరో, అతని స్నేహితుడు వాకబుచేయడం చూపారు. అసలు ఇన్సిడెంట్ జరిగిన ప్రాంతం చిన్న పరిధిగలది కావడంతో అక్కడికి వచ్చే వాహనాలూ, డ్రైవర్లూ అందరికీ అక్కడ తెలుసుంటారు. అలాంటిది ఎవరెవర్నో అందుకోసం ఎంక్వెయిరీ చేసినట్టు చూపుతారు. దాంతోపాటు మృతుడి శరీరంపై ముఖ్యంగా హత్య జరిగిన విధానంలో గొంతుకపై నులిపినట్టు గాట్లు వుంటాయి. దాన్నిబట్టి ప్రాథమికంగా అది ఆత్మహత్య కాదు హత్యేనని తేల్చచ్చు. ఇలాంటి దాన్ని ఇది హత్యో, ఆత్మహత్యో లేదా ప్రమాదవశాత్తూ లోయలో పడ్డదా అన్నది తేలాలి’ అని పోలీసులతో చెప్పించడం విడ్డూరం. ఇక సినిమాలో బహిరంగంగా అందరూ చూస్తుండగా అలా తీవ్రస్థాయిలో కొట్టుకోవడం, దాన్ని కనీసం ఎవరూ ఆపకపోవడం చూస్తుంటే మనం అసలు ఏకాలంలో ఉన్నాం అని అనిపిస్తుంది. ఇక కథానాయకుడు తన ప్రేమ వ్యక్తీకరణలో భాగంగా కథానాయికకు ఓ పది రూపాయల నోటుపై ‘నువ్వంటే నాకిష్టం’ అని రాసివ్వడం వంటివి ప్రస్తుతం ఉన్న కాలస్థితికి ఏరకంగా సరిపోతుందో అన్నది ఒక్కసారి దర్శకుడు ఆలోచించి వుంటే ఇంతకంటే మంచి ఆలోచన సన్నివేశానికి వచ్చేది. అదేవిధంగా ఎంతగా ఓ వ్యక్తి డ్రింకింగ్ అలవాటున్నా, ఈ సినిమాలోలా బస్సుదిగిన వెంటనే బుడ్డి వెంట వెళ్లడం వంటిది జరగదు. ఎంతగా అది కొండ ప్రాంతమైనా టాయిలెట్‌కి ఇంకా అలా ఓ ఉద్యోగ స్థితిలో ఉన్న వ్యక్తులు బహిర్భూమిని ఆశ్రయించడం విచిత్రం. ఇవన్నీ జీర్ణించుకుని చూస్తే సినిమాలో ఎన్నదగిన అంశం కెమేరామెన్ శేఖర్ వి జోసఫ్ పనితనం. చిత్రంలోని హిల్‌స్టేషన్ అందాలు కళ్లకు కట్టిపడేశారు. పెర్‌ఫార్మెన్స్ పరంగా అందరూ కథానుసారం బానే చేశారు. కథానాయకుడిగా సుమంత్ అశ్విన్ ఇంకాస్త పొడుగుంటే బావుండేది. బాహుబలి ప్రభాకర్ యాస పలకడానికి కష్టపడ్డాడు. విశ్వనాథం మాస్టారుగా నాజర్ పాత్రానుసారం బాగానే నటించినా, చిరకాలంగా తెలుగులో విరివిగా నటిస్తున్న పరభాషా నటుడు కనుక భాషపై ఇంకా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఈ సినిమా మరోసారి విప్పి చెప్పింది. డైలాగ్స్‌లో ఒక లైన్ పంచ్‌లు- (ఆర్టీసీ బస్‌లో కండెక్టర్‌కన్నా డ్రైవర్‌కే ‘వెయిట్’ ఎక్కువ. అని శేషు అంటే, అందుకు ప్రతిగా తాగుబోతు రమేష్ పాత్ర అవును. ‘వెయిట్’ చూస్తేనే తెలుస్తోంది అని బాహుబలి ప్రభాకర్ ఆకారం చూసి అనడం బాగా పేలింది. అలాగే జీవా పాత్ర ‘సెల్ఫ్‌డౌన్’ అయింది అన్న పదమూ అప్పుడు తానున్న పరిస్థితికి అనుసరించి చక్కగా నమోదైంది). బావున్నా.. గారెల చిల్లులో వేలుపెట్టి ‘షకలక’ శంకర్ పాత్రతో ‘ఇది నీ గారి, మీ అమ్మ... అమ్మ...’’ అని అనిపించడం చీప్ టేస్ట్‌ని తెలియజేసింది. జెబి స్వరాల్లో ఎక్కువగా గ్రూప్ సింగింగ్ థీమ్‌ని తీసుకున్నట్టు అనిపించింది. బాగానే ఉన్నా ఎన్నదగ్గ రీతిలో ఏదీ లేదు. కానీ ఓ పాటలో ‘విధి రాతో, ఎదురీతో బదులేలేని ప్రశ్న’ వాక్యాలకు కొనసాగింపుగా ‘మలచే’ అన్న పదం వద్ద గాయకుడు పాడిన విధం ఆకట్టుకుంది. ముందే చెప్పుకున్నట్టు ఎప్పుడో నాలుగేళ్ల క్రితం (2012) మామూలు కథాంశంతో వచ్చిన మలయాళ చిత్రాన్ని రీమేక్ చేయడం హర్షించతగ్గ ప్రయత్నం కాకపోయినా కనీసం తెలుగువారి మనఃస్థితికి ఇప్పటి కాలానికి అనుగుణంగా మను (దర్శకుడు) మార్పులుచేసి వుంటే కొంతలో కొంతైనా, ‘రైట్ రైట్’కు ‘రైట్’ ఫలితాలు వచ్చేవేమో!

-అనే్వషి