యువ

గూగుల్‌కి తెలియని విద్య గలదె!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉత్తరాన హిమాలయాలు...దక్షిణాన హిందూ మహా సముద్రం... తూర్పున బంగాళాఖాతం...మరి పడమట? మరచిపోయారా?
మరేం ఫర్లేదు...గూగులమ్మ తల్లి ఉందిగా? అదేనండీ..గూగుల్ సెర్చ్! ఇట్టే చెప్పేస్తుంది.
**************
అమెరికా అధ్యక్షుడిగా జార్జి బుష్ జూనియర్ ఎనే్నళ్లు పనిచేశాడు డాడీ! అని మీ అబ్బాయి అడిగిన ప్రశ్నకు మీరు తెల్లమొహం వేశారు. అంతలోనే తేరుకుని... క్షణంలో చెబుతానని ధీమాగా హామీ ఇచ్చేశారు.
గూగులమ్మ తల్లిని చూసుకునేగా ఆ భరోసా?
**************
ఎన్టీరామారావు, అంజలీదేవి భార్యాభర్తలుగా నటించిన ఓ సినిమాలో ‘బూచాడమ్మా బూచాడు.. బుల్లిపెట్టెలో ఉన్నాడు’ అనే పాట ఉంది. ఐదక్షరాల ఆ సినిమా పేరేమిటి?- వీక్లీ గడినుడిలో ప్రశ్న మీ బుర్రకు పరీక్ష పెట్టింది. ఇక లాభం లేదనుకుని లాప్‌టాప్ తీశారు.
గూగులమ్మ తల్లి కోసమేగా?
**************
గూగుల్ సెర్చ్... జనజీవనంలో ఓ భాగమైపోయింది. చిన్నా పెద్దా వయసుతో నిమిత్తం లేదు. ఎవరికైనా ఇది స్నేహ హస్తం అందిస్తుంది. అడిగినదాన్ని ఇట్టే అందజేస్తుంది. ఏది కావాలన్నా క్షణాల్లో కళ్లముందు సాక్షాత్కరింపజేసే ఈ సెర్చి ఇంజన్‌తో పని పడని రోజు ఉండదు. గూగుల్ సెర్చ్ కేవలం వెబ్‌సైట్లను వెతికిపెట్టేందుకు, నాలుగైదు విడి పదాలను టైప్ చేస్తే మనకు కావలసిన సమాచారాన్ని ఇచ్చేందుకు మాత్రమే పనికొస్తుందనేది చాలామందిలో ఉన్న భావన. కానీ, గూగుల్ ఓ రకంగా ఉల్లిపాయలాంటిది. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు కదా. అలా...గూగుల్ సెర్చ్ చేసే సహాయాలు చాలానే ఉన్నాయి. చాలామందికి అవేమిటో తెలీదు. ఉదాహరణకు... ఏదైనా ఓ పదానికి అర్థం తెలియకపోతే వెంటనే ఆన్‌లైన్ డిక్షనరీని ఓపెన్ చేస్తారు. కానీ గూగుల్ సెర్చ్ ఇంజన్..డిక్షనరీగా కూడా ఉపయోగపడుతుంది. అలాగే లెక్కలు కట్టాలంటే కాలిక్యులేటర్ ఆన్ చేస్తారు. కానీ గూగులే కాలిక్యులేటర్ కూడా అనే సంగతి ఎంతమందికి తెలుసు? ఇలా గూగుల్ సెర్చ్ ఇంజన్‌తో చాలా ఉపయోగాలున్నాయి. అవేమిటో తెలుసుకుందాం.
ఓ వెబ్‌సైట్‌లో ఫలానా వ్యక్తి గురించి నిర్దిష్టమైన సమాచారం ఉందని మీకు ఫ్రెండెవరో చెబుతారు. ఆ వ్యక్తి పేరు గూగుల్ సెర్చ్‌లో టైప్ చేస్తే రకరకాల వెబ్‌సైట్లలో ఉన్న ఆ వ్యక్తి సమాచారమంతా మీ ముందు ప్రత్యక్షమవుతుంది. అందులోంచి మీకు కావలసిన వెబ్‌సైట్‌లో సమాచారం వెతికి పట్టుకోవడం పెద్ద తలనొప్పి. ఉదాహరణకు www.gizmag.com అనే వెభ్‌సైట్‌లో thomas అనే వ్యక్తి గురించి మీకు సమాచారం కావాలనుకోండి. అప్పుడు "thomas site:www.gizmag.com'' అని టైఫ్ చేస్తే చాలు...ఆ వెబ్‌సైట్‌లో ధామస్ గురించిన సమాచారం మీముందు ప్రత్యక్షం. అలాగే "source'' అనే కమాండ్‌ను ఉపయోగించి గూగుల్ న్యూస్‌లో వార్తా సమాచారాన్ని కూడా తెలుసుకోవచ్చు.
**************
ఓ వెబ్‌సైట్‌లో మీకు కావలసిన సమాచారం ఉందని గుర్తు. కానీ ఆ వెబ్‌సైట్ పూర్తి పేరేమిటో తెలీదు. డొమైన్ నేమ్‌లో beauty అనే పదం ఉన్నట్టు మాత్రం తెలుసు. ఎలా? వాస్తవానికి ఆ వెబ్‌సైట్‌ను వెతికి పట్టుకోవడానికి ఆ ఒక్క పదమే చాలు. మీరేం చేయాలంటే... "related:www.beauty.com'' అని గూగుల్ సెర్చ్‌లో టైప్ చేయండి. బ్యూటీ పేరిట ఉన్న వెబ్‌సైట్లన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.
**************
ఓ పదానికి అర్థం తెలీక పోతే అర్జెంటుగా ఆన్‌లైన్ డిక్షనరీని ఓపెన్ చేయాల్సిన పనిలేదు. గూగుల్ సెర్చ్ ఇంజన్ పదాలకు అర్థాలనూ చెబుతుంది. ఉదాహరణకు strive అనే పదానికి అర్థం తెలియాలంటే "define:strive'' అని టైప్ చేస్తే దాని అర్థం ఇట్టే తెలిసిపోతుంది.
**************
కొలతలు...కొలమానాలు కూడా గూగుల్ సెర్చ్ ఇంజన్‌తో ఈజీ. సెంటీమీటర్లను అంగుళాల్లోకి మార్చాలా? ఎన్ని మీటర్లు ఓ కిలోమీటర్ అవుతుందో తెలుసుకోవాలా? ఉదాహరణకు 15 సెంటీమీటర్లను అంగుళాల్లోకి మార్చాలంటే, సింపుల్‌గా "15 centimetres in inches'' అని టైప్ చేస్తే చాలు.
**************
కరెన్సీ మారకం కూడా గూగుల్ సెర్చితో సాధ్యం. 5000 రూపాయలకు ఎన్ని అమెరికన్ డాలర్లు వస్తాయో తెలుసుకోవాలంటే "5000 rupees in usd'' అని టైప్ చేయాలి.
**************
లెక్కల్లోనూ గూగుల్ సెర్చ్ దిట్టే. పదికి ఇరవై కలిపితే ఎంత లాంటి సింపుల్ క్వశ్చనే్స కాదు... అడ్వాన్స్‌డ్ మేథమెటిక్స్‌లోనూ గూగుల్‌కి సాటిలేదు.
**************
విమానాల రాకపోకల వివరాలు తెలుసుకునేందుకూ గూగుల్ సెర్చ్ ఉపయోగపడుతుంది. ఎయిర్‌లైన్స్ పేరు, ఫ్లైట్ నంబర్ టైప్ చేస్తే వివరాలన్నీ మీ ముందుంటాయి. *