నమ్మండి! ఇది నిజం!!

మరపు ఓ శాపం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మిషెల్ ఫిల్‌పాట్ ఓ ప్రత్యేక వ్యక్తి. ఇంగ్లండ్‌లోని స్పాల్డింగ్ అనే ఊళ్లో నివసించే ఈమెని ఈ రోజు కూడా అమెరికన్ ప్రెసిడెంట్ ఎవరంటే, బిల్ క్లింటన్ అని చెప్తుంది. ప్రతీ ఉదయం ఆమె భర్త తమకి పెళ్లైందన్న రుజువుగా ఆమెకి తమ పెళ్లి ఫొటోని చూపించి నమ్మించాల్సి ఉంటుంది. ఇందుకు కారణం 1994 దాకా ఆమెకి జీవితంలో జరిగిందంతా గుర్తుంది. ఆ తర్వాత జరిగింది ఏమీ గుర్తులేదు.
1994లో జరిగిన రెండు కారు ప్రమాదాల్లో మిషెల్ మెదడు దెబ్బతింది. ఫలితంగా ఆమె మెదడు కొత్త జ్ఞాపకాలని రికార్డ్ చేసే శక్తిని కోల్పోయింది. 1994కి మునుపే ఆమె తన భర్తతో డేటింగ్ చేసి 1997లో, అంటే ఈ ప్రమాదం జరిగాక పెళ్లి చేసుకుంది. 45 ఏళ్ల మిషెల్‌కి గల ఈ జబ్బుని ఏంటిరో గ్రేడ్ అనీషియా అంటారు. ఏంటిరో గ్రేడ్ అనీషియా రోగులు ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉన్నారు.
పాతవి పూర్తిగా మర్చిపోయే జబ్బుని రెట్రోగ్రేడ్ అనీషియా అంటారు. కొందరు ఈ రకం అనీషియాలో మొహాలు మర్చిపోతే, ఇంకొందరు తమ మాతృభాషని కూడా మర్చిపోతారు. కొందరు అంతా - తాము ఎవరో సహా - మర్చిపోతారు.
అనీషియా అంటే మర్చిపోవడంలో మూడు రకాలు ఉన్నాయి. వాటిని 1.ఏంటిరో గ్రేడ్ అనీషియా 2.రెట్రో గ్రేడ్ అనీషియా 3.ట్రాన్సియెంట్ గ్లోబల్ అనీషియా అంటారు. తలకి దెబ్బ తగలడం వల్ల, లేదా డ్రగ్స్ కాని, ఆల్కహాల్ కాని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల మెదడులోని టెంపరల్ లోబ్స్‌కి నష్టం వాటిల్లి రెట్రో గ్రేడ్, ఏంటిరో గ్రేడ్ అనీషియాలు వస్తాయి.
ఒకోసారి కొందరికి మూడో రకానికి చెందిన ట్రాన్సియెంట్ గ్లోబల్ అనీషియా వస్తుంది. ఇది తలకి దెబ్బ తగలకుండానే లేదా ఆల్కహాల్, డ్రగ్స్ తీసుకోకుండానే వస్తుంది. ఏ రోడ్ మీదో నడుస్తూంటేనో లేదా మరెక్కడో అకస్మాత్తుగా తమ గతాన్ని మర్చిపోతారు. సుమారు ఇరవై నాలుగు గంటల దాకా వారికి గతం గుర్తు రాదు. అంతేకాక తర్వాత గతం గుర్తొచ్చాక ఈ సమయంలో జరిగినవి గుర్తుండవు. సాహిత్యంలో, సినిమా కథల్లో ఈ రకం అనీషియాలు రచయితలకి ముడి పదార్థాలుగా మారాయి.
మేయో క్లినిక్ న్యూరాలజిస్ట్, అమెరికన్ అకాడెమీ ఆఫ్ న్యూరాలజీ సభ్యుడైన డాక్టర్ రోనాల్డ్ పీటర్‌నెస్ అనీషియా చికిత్సలో నిపుణుడు. ఆయన చికిత్స చేసిన ఓ కేసులో రోగికి ఏదైనా ముప్పై క్షణాలు మాత్రమే గుర్తుంటుంది! ఆ తర్వాత మళ్లీ తాజా ముప్పై క్షణాల్లో జరిగింది తప్ప పాతవి గుర్తుండవు!
1985లో ఇంగ్లీష్ మ్యూజికాలజిస్ట్ క్లైవ్ లేరింగ్‌కి రెట్రో గ్రేడ్, ఏంటిరో గ్రేడ్ అనీషియాలు రెండూ వచ్చాయి. మెదడుకి వచ్చిన ఇన్‌ఫెక్షన్ వల్ల అతనికి ఈ వ్యాధులు సోకాయి. ఎన్‌సెఫిలైటిస్ హెర్పిస్ అనే మెదడు వ్యాధి వల్ల ఈ రెండు అనీషియాలు ఒకేసారి సోకుతాయి. అతని భార్య డెబ్రా 2005లో ‘్ఫరెవర్ టు డే’ (ఈ రోజు శాశ్వతం) అనే జ్ఞాపకాలని భర్త గురించి రాసింది. 1986లో జోనాథన్ మిల్లర్ అనే దర్శకుడు ప్రిజనర్ ఆఫ్ కాన్షస్‌నెస్ అనే డాక్యుమెంటరీని క్లైవ్ మీద తీశాడు.
‘నేనేదీ వినలేదు. ఏదీ చూడలేదు. దేన్నీ స్పర్శించలేదు. దేన్నీ వాసన చూడలేదు. మరణించిన వారికి కూడా ఇదే అనుభవం ఉంటుందని అనుకుంటా’ క్లైవ్ ఆ డాక్యుమెంటరీలో చెప్పాడు.
అతను రాసుకున్న జ్ఞాపకాల నోట్‌బుక్‌లో ‘నేను మేలుకుని ఉన్నాను.. నేను మొదటిసారి నిద్ర లేచాను.. నేను పూర్తిగా మెలకువగా ఉన్నాను.. నేను ఇప్పుడే నిద్ర లేవడం నిజం...’ ఇలా ఉన్నాయి.
జార్జియాలోని రిచ్‌మండ్ హిల్‌లో ఆ మధ్య ఓ వింత కేసు నమోదైంది. బర్గర్ కింగ్ రెస్ట్‌రెంట్ వెనక ఓ వ్యక్తి స్పృహ లేకుండా ఉండటం గమనించి ఎవరో పోలీసులకి సమాచారం అందించారు. అతనికి స్పృహ వచ్చాక పోలీసులు అతని పేరు అడిగితే చెప్పలేకపోయాడు. అతని దగ్గర పర్స్ లేదు కాబట్టి ఐడెంటిటీ కార్డ్ అతని దగ్గర లేదు. అతను తన మొహాన్ని అద్దంలో చూసుకుని దాన్ని కూడా గుర్తుపట్టలేక పోయాడు! బర్గర్ కింగ్ రెస్ట్‌రెంట్ వెనక ఆ సంఘటన జరగడం వల్ల పాత్రికేయులు అతనికి బి.కె. అనే పేరు పెట్టారు.
డిఎన్‌ఏ రీసెర్చ్‌లో కూడా అతను ఎవరో తెలీలేదు. దాంతో బి.కె.కి ఫుల్‌ఫాంగా బెంజమిన్ కైల్‌గా మార్చారు. ఈ రోజుకీ తను ఎవరో అతనికి తెలీదు. అతను ఎవరో ఎవరికీ తెలీదు.
ఈ అనీషియాల మీద ఇంకా శాస్త్ర పరిశోధనలు జరగాల్సి ఉంది.

పద్మజ