యువ

బాప్‌రే.. భలే యాప్స్!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యాప్స్ లేని స్మార్ట్ఫోన్లను ఊహించలేం. ప్రపంచాన్ని చిటికెలో కళ్లకు కట్టేది స్మార్ట్ఫోనయితే, ఏ అంశంపైనైనా సమగ్రమైన సమాచారాన్ని లేదా సేవలను అందించేది యాప్. రోజుకూ కొన్ని లక్షల యాప్స్ వస్తున్నాయి. వీటిలో చాలావరకూ మన అవసరాలు తీర్చేవే. అలాంటివాటిలో సృజనాత్మకతకు, తెలివితేటలకు పెట్టింది పేరయిన భారతీయులు సృష్టించిన యాప్స్ కూడా బోలెడున్నాయి. వాటిలో అందరి మన్ననలనూ చూరగొన్న యాప్స్.. వాటి వివరాలు... మీకోసం...
Hike Messenger
ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఫట్ల యూత్ చెవి కోసుకుంటోంది. వాట్సాప్, వైబర్, ఉయ్ చాట్ వంటి యాప్స్‌కు గిరాకీ పెరగడానికి కారణమదే. ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలను పెంపొందించడంలో సైబర్ ప్రపంచంలో మెసెంజర్స్‌దే కీలకపాత్ర. ఈ కోవకు చెందినదే హైక్ మెసెంజర్. ఇది ‘మేడ్ ఇన్ ఇండియా’ యాప్. వివిధ భారతీయ భాషల్లో స్టికర్స్ సౌకర్యాన్ని అందిస్తున్న యాప్ కావడంతో హైక్ మెసెంజర్‌కు విపరీతమైన గిరాకీ ఏర్పడింది. యాప్ స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న హైక్ మెసెంజర్‌ను ఇప్పటివరకూ డౌన్‌లోడ్ చేసుకున్నవారి సంఖ్య కోటీ యాభై లక్షలమందికి పైనే.
Hotstar
టెలివిజన్‌లో వచ్చే టీవీ సీరియళ్లు, రియాల్టీ షోలకు డిమాండ్ పెరగడంతో వినియోగదారులను దృష్టిలో ఉంచుకుని రూపొందించిన యాప్- హాట్‌స్టార్. యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫోన్లపై ఈ యాప్‌ను ఉచితంగానే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. యూజర్లు తమకు నచ్చిన టీవీ షోలు, బాలీవుడ్, హాలీవుడ్, తమిళ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ సినిమాలనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్ అందిస్తున్న మరో సౌకర్యం- లైవ్ క్రికెట్! సుమారు 50 లక్షల మంది దీనిని ఇప్పటివరకూ డౌన్‌లోడ్ చేసుకున్నట్టు అంచనా.
Cricbuzz
మన దేశంలో క్రికెట్‌కున్న డిమాండ్‌ను మాటల్లో చెప్పలేం. క్రికెట్ అనేది మన జీవన విధానంలో ఓ భాగమైపోయింది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని కొందరు ఔత్సాహిక భారతీయులు రూపొందించిందే- క్రిక్‌బజ్. ఐపిఎల్ మ్యాచ్‌లూ, వనే్డలు, టెస్టులు, క్రికెట్‌లో వివాదాలు ...ఇలా క్రికెట్‌కు సంబంధించిన సకల సమాచారాన్ని కళ్ళకు కట్టేదే క్రిక్‌బజ్ యాప్. ఉచితంగా లభించే క్రిక్‌బజ్ యాప్‌ను నలభై లక్షల మంది వినియోగిస్తున్నారు.
Zomato
ఫ్రెండ్స్‌తో పిక్నిక్‌కు వెళ్లార..లేదా ఫ్యామిలీతో విహారయాత్రకు వెళ్లారు. మీ అభిరుచికి తగిన రెస్టారెంట్‌కోసం వెతికారు..కానీ సరైన సమాచారం దొరకలేదు. చివరికి అయిష్టంగానే ఏదో ఓ రెస్టారెంట్‌లో తినేసి, అసంతృప్తితో బయటపడ్డారు. అయితే జొమాటో యాప్ ఉంటే, ఇక ఇలాంటి కష్టాలకు చెల్లుచీటీ పాడేయొచ్చు. దేశవ్యాప్తంగా రకరకాల హోటళ్లు, రెస్టారెంట్లు వాటిల్లో దొరికే ఫుడ్ ఐటెమ్స్ గురించి సమస్త సమాచారాన్నీ అందించే యాప్- జొమాటో. ఈ యాప్ ద్వారా సమాచారాన్ని తెలుసుకోవడమే కాదు... ఫుడ్‌ని ఆర్డర్ ఇవ్వడం కూడా తేలికే. దేశంలోని 13 ప్రధాన నగరాల్లో 50 వేల రెస్టారెంట్ల సమాచారాన్ని జొమాటో మీకందిస్తుంది. దీని ద్వారా లబ్ధి పొందుతున్న వారి సంఖ్య 40లక్షలకు పైమాటే.
Flipkart
ఇండియాలోనే అతి పెద్ద ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్- ఫ్లిప్‌కార్ట్‌ను రూపొందించింది భారతీయులే. షాపులకు స్వయంగా వెళ్లి వస్తువుల్ని కొనుగోలు చేసే సాంప్రదాయకమైన పద్ధతికి స్వస్తి పలికి, ఆన్‌లైన్‌లో కొనుగోళ్లను ప్రోత్సహించి, కొన్న వస్తువుల్ని నేరుగా ఇంటికే చేరవేసే పద్ధతికి శ్రీకారం చుట్టిన ఫ్లిప్‌కార్ట్ యాప్‌ను వినియోగిస్తున్నవారి సంఖ్య కోటి దాటిందంటే ఆశ్చర్యం కలగకమానదు. వినియోగదారుల్ని ఆకట్టుకునేందుకు ఫ్లిప్‌కార్ట్ అనుసరిస్తున్న డిస్కౌంట్ల విధానం కూడా ఈ యాప్‌కు ఆదరణ పెరిగేందుకు దోహదపడుతోంది.
Just Dial
మీ దగ్గర్లో ఉన్న వ్యాపార సంస్థలు, రకరకాల ఉత్పత్తులు, సేవలు వంటి అంశాలపై సమాచారాన్ని అందించే జస్ట్ డయల్... నగరవాసుల మన్నన లు పొందిన మరో యాప్. ఏ థియేటర్లో ఏ సినిమా ఉందో, ఎక్కడ ఆర్ట్ షో వంటి ఈవెంట్లు జరుగుతున్నాయో జస్ట్ డయల్‌తో తెలుసుకోవచ్చు. అలాగే సమీపంలో ఉన్న ఏటీఎంలు, హోటళ్లు, డాక్టర్లు వంటి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ఈ సమాచారాన్ని అందించేందుకు జస్ట్ డయల్... జిపిఎల్, గూగుల్ మాప్స్‌పై ఆధారపడుతోంది. ఉచితంగా లభించే ఈ యాప్‌ను 30 లక్షల మంది వినియోగిస్తున్నారు.
Quickr
ఆన్‌లైన్‌లోనూ, మొబైల్‌లోనూ క్లాసిఫైడ్స్‌ను అందించే అతి పెద్ద పోర్టల్‌గా క్వికర్‌కు పేరు. దేశవ్యాప్తంగా 900 నగరాల్లో విస్తరించిన క్వికర్‌కు 40 లక్షలమంది వినియోగదారులు ఉన్నారు. స్థానికంగా ఉండే వినియోగదారుల అవసరాలు తీర్చేందుకు ఏర్పాటైన క్వికర్...మొబైళ్లు, రియల్ ఎస్టేట్, కార్లు, సర్వీసులు, ఉద్యోగాలు, సినిమాలు, ఫర్నిచర్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో అమ్మకాలు, కొనుగోళ్లు, సమాచారం అందించడం వంటి సేవలు కల్పిస్తోంది. మాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా, ఒమిడ్యార్ నెట్‌వర్క్, నార్వెస్ట్ వెంచర్ పార్ట్‌నర్స్ వంటి సంస్థలు క్వికార్‌కు అండదండలందిస్తున్నాయి. క్వికార్‌లో ఇ-బే సంస్థ పెట్టుబడులు పెట్టింది.
Paytm
పేటిఎమ్- మొబైల్ పేమెంట్ సర్వీస్ యాప్. విజయ్ కుమార్ శర్మ అనే భారతీయుడు దీనిని అభివృద్ధి చేశారు. మొబైల్ రీచార్జ్, యుటిలిటీ బిల్లుల చెల్లింపులకోసం ఉద్దేశించిన పేటిఎమ్ యాప్‌ను కోటిమందికి పైగా వినియోగిస్తున్నట్టు అంచనా.
*