రాష్ట్రీయం

భద్రతే కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజధాని భవనాల నిర్మాణంపై చర్చ * ముగిసిన ప్రపంచస్థాయి ఆర్కిటెక్చర్ల సదస్సు
విజయవాడ, నవంబర్ 21: కొత్త రాజధాని నిర్మాణం సందర్భంలో కీలకమైన సచివాలయం, శాసనసభ, శాసనమండలి, రాజ్‌భవన్‌ల డిజైన్లను అత్యున్నత భద్రతా ఏర్పాట్లు దృష్టిలోపెట్టుకుని ఖరారు చేయాలని సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో శనివారం జరిగిన ప్రపంచస్థాయి ఆర్కిటెక్ట్‌ల ఎంపిక పరిచయ సదస్సు నిర్ణయించింది. అమరావతిలో ప్రభుత్వ భవనాల సముదాయం నిర్మాణానికి సిఆర్‌డిఏ ఆధ్వర్యంలో రెండురోజుల పాటు జరిగిన ప్రపంచస్థాయి ఆర్కిటెక్ట్‌ల ఎంపిక పరిచయ సదస్సు శనివారం ముగిసింది. ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్ట్ సంస్థలు పాస్టర్ ప్లస్ పార్టన్స్, రోజర్ స్కర్ట్ హార్బర్ ప్లస్ పార్టన్స్ బృందాలతోపాటు సిఆర్‌డిఏ కమిషనర్ శ్రీకాంత్ నాగులాపల్లి, పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్, కృష్ణా జిల్లా న్యాయమూర్తి రవీంద్రబాబు, శాసనసభా కార్యదర్శి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భవనాల సముదాయం స్వరూపంపై తొలుత అధికారులు ఆర్కిటెక్ట్‌లకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా శాసనసభా కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ శాసనసభ, శాసనమండలి, సెంట్రల్ హాల్ అవసరాలు, శాసనసభ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్ చాంబర్లు ఆయా సభలతో అనుసంధానమై ఉండాలన్న నియమాన్ని ఆర్కిటెక్ట్‌లకు వివరించారు. ప్రభుత్వ భవనాల సముదాయంలో సచివాలయం కీలకమని, ఇందులో సిఎం, మంత్రులతోపాటు సిఎస్, అన్ని శాఖల కార్యదర్శులు, సిబ్బందికి తగిన విధంగా డిజైన్లు ఉండాలని వివరించారు. ఇక రాజ్‌భవన్ నిర్మాణంలో గవర్నర్ నివాసానికి, వివిధ సమావేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. రాజ్‌భవన్‌లో అవసరమైతే రాష్టప్రతి వంటి విశిష్ట అతిథులు బస చేసేందుకు అనువుగా సౌకర్యాలు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. హైకోర్టు డిజైనింగ్‌లో కోర్టు హాల్ విశాలంగా ఉండాలని, న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, కక్షిదారులకు వేర్వేరు ప్రవేశ మార్గాలు ఉండాలని కృష్ణాజిల్లా న్యాయమూర్తి, హైకోర్టు నోడల్ అధికారి రవీంద్రబాబు సూచించారు. హైకోర్టు హాల్ విశాలంగా, ఎత్తుగా ఉండాలని, కారిడార్, చాంబర్స్ సౌకర్యంగా డిజైన్ చేయాలని చెప్పారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా కోర్టు హాళ్లు 60కి పైగా నిర్మించాల్సి ఉందన్నారు. న్యాయమూర్తుల నివాసాలకు కోర్టు సాధ్యమైనంత అనుసంధానంగా ఉండాలని సూచించారు. పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ అన్ని భవనాలను భద్రత దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేయాలన్నారు. వాహనాల పార్కింగ్‌ను భవనాల సెల్లార్లలో ఏర్పాటు చేయవద్దని సమీపంలో పార్కింగ్ ప్రదేశం డిజైన్ చేయాలని సూచించారు. రాజధానిలో ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్లు రూపొందించటం తమకొక మంచి అవకాశమని ఆర్కిటెక్ట్‌లు చెప్పారు.
అమరావతి ప్రభుత్వ భవనాల సముదాయం డిజైన్ ఎంపికకు అంతర్జాతీయ స్థాయిలో పలువురు ఆర్కిటెక్ట్‌లు, ప్రణాళికారంగ నిపుణులు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. జపాన్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రొఫెసర్ ఎర్విన్ విరే, భారతదేశం ప్రముఖ ఆర్కిటెక్ట్ ప్రొఫెసర్ క్రిస్ట్ఫోర్ బెనిన్‌జర్, ఢిల్లీలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్, మాజీ డీన్ అర్బన్ ప్లానింగ్ నిపుణులు ప్రొఫెసర్ కెటి రవీంద్రనాథ్‌లు జ్యూరీ సభ్యులుగా వ్యవహరిస్తున్నారు.