జాతీయ వార్తలు

వయొలినిస్ట్ కన్యాకుమారికి కళానిధి పురస్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, జూలై 24: ప్రముఖ వయొలిన్ విద్వాంసురాలు ఎ కన్యాకుమారి ఈ ఏడాది మద్రాసు మ్యూజిక్ అకాడమీ ప్రతిష్ఠాత్మక సంగీత కళానిధి పురస్కారానికి ఎంపికయ్యారు. ఆదివారం ఇక్కడ సమావేశమైన కార్యవర్గం ఆమెను ఈ పురస్కారానికి ఏకగ్రీవంగా ఎంపిక చేసినట్లు అకాడమీ అధ్యక్షుడు ఎన్ మురళి చెప్పారు. అకాడమీ చరిత్రలోనే ఈ అవార్డు ఓ మహిళా వయొలినిస్టును వరించడం ఇదే మొదటిసారని, ఈ ఏడాది డిసెంబర్ 25నుంచి వచ్చే ఏడాది జనవరి 1 దాకా జరిగే అకాడమీ 90వ వార్షికోత్సవాలకు ఆమె అధ్యక్షత వహిస్తారని మురళి చెప్పారు. జనవరి 1న జరిగే సదస్సులో ఆమెకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తారు. కర్ణాటక సంగీతంలో అత్యున్నత పురస్కారంగా భావించే ఈ అవార్డును అందుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా కన్యాకుమారి చెప్పారు. ఆంధ్రలోని విజయనగరం పట్టణానికి చెందిన కన్యాకుమారి ఇవటూరి విజయేశ్వరరావు వద్ద వయొలిన్‌లో తొలి పాఠాలు నేర్చుకున్నారు. అనంతరం ఆమె ప్రముఖ విద్వాంసుడు ఎం చంద్రశేఖరన్ వద్ద మెళకువలు నేర్చుకున్నారు. 1971లో ఆమె ఎంఎల్ వసంతకుమారి (ఎంఎల్‌వి) శిష్యురాలయ్యారు. 19 ఏళ్లు తాను ఎంఎల్‌వి సాహచర్యంలో గడిపినట్లు కన్యాకుమారి చెప్పారు. కన్యాకుమారి దేశ విదేశాల్లో ఎన్నో కచేరీలు చేయడమే కాకుండా కర్ణాటక సంగీతంలోని మహామహులందరితోనూ కలిసి పని చేశారు. నిత్యం సంగీతంలో ప్రయోగాలు చేసే కన్యాకుమారి తిరుపతి వెంకటేశ్వరుడి ఏడుకొండలకు గుర్తుగా ‘సప్తాద్రి’ పేరుతో ఏడు కొత్త రాగాలను కూడా సృష్టించారు. దేశ విదేశాల్లో ఎందరో శిష్యులను తయారుచేసిన ఆమె వారి వద్దనుంచి ఒక్క పైసా కూడా తీసుకునే వారు కాదు.