ఆంధ్రప్రదేశ్‌

కాకినాడలో ‘నారాయణ’ విద్యార్థిని ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 28: తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలోని నారాయణ కళాశాలకు చెందిన ఓ విద్యార్థిని గురువారం తెల్లవారుజామున ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంపిసి ద్వితీయ సంవత్సరం చదువుతున్న గెడ్డం భారతి (17) తరగతి గదిలోనే ఫ్యానుకు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఉదంతం విద్యార్థి, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది. జిల్లాలోని సఖినేటిపల్లి మండలం గొంది గ్రామానికి చెందిన భారతి రాజమహేంద్రవరంలోని తన పెద్దమ్మవద్ద ఉంటోంది. తండ్రి గెడ్డం సత్తిబాబు మద్యానికి బానిస కావడం, తల్లి ఉద్యోగ రీత్యా దుబాయ్‌లో ఉంటుండటంతో తాను ఒంటరితనాన్ని భరించలేకే ఆత్మహత్యకు పాల్పడినట్టు ఆత్మహత్యకు ముందు రాసినట్టు భావిస్తున్న లేఖలో పేర్కొందని పోలీసులు తెలిపారు. భారతి ఆత్మహత్య ఉదంతంపై విద్యార్థి సంఘాలు తీవ్రంగా స్పందించాయి. నారాయణ విద్యా సంస్థ విద్యార్థులపై తెస్తున్న వత్తిళ్ల కారణంగానే ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ ఒక ప్రకటనలో ఆరోపించింది. రాష్ట్ర మంత్రి నారాయణకు చెందిన కళాశాలల్లో ఇటువంటి ఆత్మహత్యలు అనేకం జరిగాయని వైకాపా తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు ఆరోపించారు.