హైదరాబాద్

పంద్రాగస్టు వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ఘనంగా నిర్వహించేందుకు వీలుగా అన్ని ప్రభుత్వ శాఖలు చక్కటి సమన్వయంతో పనిచేసి, పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ ఆదేశించారు.
ఈ మేరకు పంద్రాగస్టు వేడుకలకు మరోసారి వేదిక కానున్న గోల్కొండ కోట, పరిసర ప్రాంతాల్లో ఏర్పాట్లను ఆయన గురువారం పరిశీలించారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, స్వాతంత్య్ర సమరయోధులు, విద్యార్థులు వివిఐపిల పాల్గొంటున్నందున పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. అంతేగాక, ఆ రోజున గోల్కొండకు చేరుకునే రూట్ పొడువున భద్రత ఏర్పాట్లు, ఎంట్రెన్స్‌లు, పార్కింగ్ స్థలాలు వంటి అంశాల ప్రాతిపదికన ఆయన ఆయా ప్రాంతాలను పరిశీలించినానంతరం గోల్కొండ కోటలోనే వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాట్లపై ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. ప్రజల సౌకర్యార్థం మొబైల్ టాయిలెట్లు, డస్ట్‌బిన్లను ఏర్పాటు చేయాలని సూచించారు. వచ్చిన అతిధులు, ప్రజలకు తాగునీటిని బాటిళ్లు, సాచెట్ల ద్వారా అందించాలని జలమండలి అధికారులను ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల నిమిత్తం వైద్యులతో కూడిన అంబులెన్స్‌ను కూడా అందుబాటులో ఉచాలని ఆదేశించారు. వైద్యారోగ్యశాఖ, ప్రత్యామ్నాయంగా విద్యుత్ సరఫరా కోసం జనరేటర్, ఆకర్షణీయంగా గార్డెన్ లైటింగ్, కోట అలంకరణ, సూచికలు, బ్యారికేడింగ్‌లు, రెడ్ కార్పెట్, షామియానాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా వాహనాల పార్కింగ్, ఆహ్వాన పత్రాల తయారీ, విద్యార్థులను తీసుకువచ్చే వాహనాల పార్కింగ్, ఆహ్వాన కార్డుల జారీ వంటి ఏర్పాట్లలో అన్ని శాఖల అధికారుల సమన్వయంతో ముందుకెళ్లాలని సిఎస్ సూచించారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను తిలకించేందుకు వీలుగా దాదాపు 5వేల పాసులు జారీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. వేడుకలను తిలకించేందుకు వచ్చే ప్రజలకు తగు అనుమతి చర్యలుంటాయన్నారు. సుమారు వెయ్యి మంది విద్యార్థులను తరలించేందుకు అవసరమైన మినీ బస్సులను అందుబాటులో ఉంచాలని టిఎస్‌ఆర్టీసి, విద్యాశాఖాధికారులను ఆదేశించారు. అగ్నిమాపక శాఖాధికారులు, పోలీసు శాఖ అధకారులు వేడుకలు ముగిసే వరకు అప్రమత్తగా ఉండాలన్నారు. ఎత్తుగా పెరిగిన చెట్లను ట్రీమ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులను వేడుకలకు ఆహ్వానించి, వేదిక వద్దకు తీసుకురావడంపై హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ భారతి హోళికేరితో ఆయన చర్చించారు. స్వాతంత్య్ర సమరయోధులను వేదిక వరకు తీసుకువచ్చేందుకు అవసరమైన వీల్ చైర్లను అందుబాటులో ఉంచాలని సిఎస్ ఆదేశించారు. ఈ పర్యటనలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ముఖ్య కార్యదర్శి సునీల్ శర్మ, ప్రోటోకాల్ కార్యదర్శి అదర్ సిన్హా, జిహెచ్‌ఎంసి కమిషనర్ బి. జనార్దన్ రెడ్డి, సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, విద్యాశాఖ డైరెక్టర్ కిషన్, పోలీసు శాఖ ఉన్నతాధికారులు అంజనీకుమార్, గౌతంసింగ్, మహేష్‌భగవత్‌తో పాటు వివిధ శాఖల అధికారులున్నారు.