నెల్లూరు

ఎమ్మెల్సీగా కేశవ్ ఏకగ్రీవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* ఆనందోత్సాహాల్లో టిడిపి శ్రేణులు
అనంతపురం, జూన్ 19:జిల్లాలో స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన పయ్యావుల కేశవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి బి.లక్ష్మీకాంతం శుక్రవారం కేశవ్ ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తూ ఆయనకు డిక్లరేషన్ అందజేశారు. దీంతో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి టిడిపి నుంచి పయ్యావుల శ్రీనివాసులు, యాట వెంకట సుబ్బయ్యతో పాటు పయ్యావుల కేశవ్ నామినేషన్లు దాఖలు చేశారు. అయితే వీరిలో శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీనికి తోడు మరే ఇతర పార్టీ నుంచి నామినేషన్ దాఖలు కాలేదు. దీంతో బరిలో కేశవ్ ఒక్కరే నిలువగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రకటించారు.
ప్రజల రుణం తీర్చుకుంటా:పయ్యావుల కేశవ్
జిల్లాలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనను ఏకగ్రీవంగా గెలిపించిన ప్రజల రుణం తీర్చుకుంటానని పయ్యావుల కేశవ్ ప్రకటించారు. ముఖ్యంగా పార్టీ అధినేత చంద్రబాబునాయుడుతో పాటు జిల్లాలోని టిడిపి కుటుంబ సభ్యులు, నాయకులు, పార్టీ కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తాను ఎమ్మెల్సీగా ఎన్నికయ్యేందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలపడంతో పాటు ఇప్పటివరకూ ప్రజల మనిషిగా ఉన్న తనకు ఎమ్మెల్సీగా ఎన్నికైన తరువాత ఆ బాధ్యత రెట్టింపు అయ్యిందన్నారు. జిల్లా కరవుకు శాశ్వత పరిష్కారం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ ద్వారానే సాధ్యమని దానిని త్వరగా పూర్తి చేసేందుకు శక్తి వంఛన లేకుండా కృషి చేస్తానన్నారు. సిఎం చంద్రబాబుకు సైతం జిల్లాపై ప్రత్యేక అభిమానం, దృష్టి ఉన్నాయన్నారు. ఆయన పట్టిసీమతో పాటు హంద్రీనీవాను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారన్నారు. దీంతో పాటు హెచ్‌ఎల్‌సి ఆధునీకరణకు కర్ణాటక ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందని దానిని కూడా పూర్తి చేసి జిల్లా ప్రజలను కరవు బారి నుంచి కాపాడుతానన్నారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లాలో భారీగా పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నామన్నారు. జిల్లాలోని చేనేతలు, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అనంతరం ఆయన కార్యకర్తలు, పార్టీ నాయకుల కేరింతలు, ఆనందోత్సాహాల మధ్య ఊరేగింపుగా స్వగృహానికి చేరుకున్నారు.