కుమారి 18+

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాల్యి మల్హోత్రా, యోధ, గోపీకృష్ణ, సాయికిరణ్, ఆదిత్యారామ్ ప్రధాన తారాగణంగా శ్రీనువిల్లా స్టూడియోస్ అసోసియేట్స్ పతాకంపై శ్రీ సత్య దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం కుమారి 18+. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా పూర్తిచేశారు. సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్‌ను ఇటీవల విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు శ్రీ సత్య మాట్లాడుతూ.. సినిమా అంతా హీరోయిన్ చుట్టే తిరుగుతుందని, డిఫరెంట్ ఏజ్‌లో వుండే నలుగురు అబ్బాయిలు అందంగా వుండే ఓ అమ్మాయిని ప్రేమిస్తారని, గేమ్‌లో ఎక్కువమంది వుంటేనే ఆసక్తి ఏర్పడుతుంది కనుక, ఆ అమ్మాయికోసం ఓ డాక్టర్, ప్రొఫెసర్, టైలర్, స్టూడెంట్ ప్రయత్నిస్తారని, నలుగురి మధ్య పోటీ ఎలా నెలకొన్నది? చివరికి ఏమైంది? అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని తెలిపారు. షూటింగ్ పూర్తిచేసి, నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నామని, ఈనెలలోనే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని ఆయన అన్నారు. యూత్‌కు నచ్చే లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రానికి పనిచేసిన వారందరూ తమ చిత్రంగా భావించి చేశారని నిర్మాతలు అన్నారు. ఓ మంచి పాత్రతో తెలుగుసినిమాలో పరిచయం కావడం ఆనందంగా వుందని కథానాయిక మాల్యిమల్హోత్రా తెలిపారు. కార్యక్రమంలో రాజ్‌కందుకూరి, మల్లికార్జునరావు, ఆదిత్యారామ్, సాయికిరణ్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. ఆలిషాఫెరెరర్, వెంకట్‌రాజు, శ్రీసత్య, జ్యోతిసాగర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: శేఖర్, సంగీతం: ప్రేమ్ ఎల్.ఎం, పాటలు: శశి, నిర్మాణం: సెనే్సషనల్ హిట్ మూవీస్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీసత్య.