బిజినెస్

ఒడిదుడుకులకు ఆస్కారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కీలకం * ఈ వారం మార్కెట్ సరళిపై నిపుణుల అంచనా
న్యూఢిల్లీ, నవంబర్ 22: ఈ నెల డెరివేటివ్ కాంట్రాక్టుల గడువు ముగింపు దశకు వస్తుండటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావచ్చంటున్నారు నిపుణులు. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ఈ నెల 26న మొదలవుతుండటంతో ఆ ప్రభావం కూడా మార్కెట్ ట్రేడింగ్‌పై ఉంటుందంటున్నారు. వీటికితోడు విదేశీ పోర్ట్ఫోలియో మదుపరుల (ఎఫ్‌పిఐ) పెట్టుబడుల సరళి, అంతర్జాతీయ పరిణామాలు, గ్లోబల్ మార్కెట్ల కదలికలు, డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు కూడా మార్కెట్‌ను ప్రభావితం చేస్తాయని పేర్కొంటున్నారు. ‘కీలక బిల్లులకు ఈ పార్లమెంట్ సమావేశాల్లోనైనా ప్రభుత్వం ఆమోదముద్ర వేయించుకుంటుందా? అన్నదానిపై మదుపరులు తీవ్రంగా గమనిస్తున్నారు.’ అని కొటక్ సెక్యూరిటీస్ ప్రైవేట్ క్లయింట్ గ్రూప్ రిసెర్చ్ అధిపతి దీపెన్ షా అన్నారు. వస్తు, సేవల పన్ను (జిఎస్‌టి) తదితర బిల్లులు పార్లమెంట్ ఆమోదం కోసం ఎదురుచూస్తున్నది తెలిసిందే. జి ఎస్‌టిని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని మోదీ సర్కారు కృతనిశ్చయంతో ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ శీతాకాల సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. కాగా, అమెరికా రిజర్వ్ బ్యాంకైన ఫెడరల్ రిజర్వ్ వచ్చే ద్రవ్యసమీక్షలో కీలక వడ్డీరేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్నదీ మార్కెట్లను ప్రభావితం చేస్తోంది. ఈ వారం దేశీయంగా చెప్పుకోదగ్గ అంశాలేవీ లేకపోవడంతో విదేశీ పరిణామాలే మార్కెట్లను శాసించవచ్చని నిపుణులు విశే్లషిస్తున్నారు. ద్రవ్యోల్బణం, పారిశ్రామికోత్పత్తి, త్రైమాసిక ఆర్థిక ఫలితాలు వంటివేమీ లేకపోవడంతో మదుపరుల చూపు అంతర్జాతీయంపై ఉంటుందంటున్నారు. కాగా, వరుసగా 3 వారాలపాటు నష్టాలపాలైన స్టాక్ మార్కెట్లు.. గత వారం లాభాలను అందుకున్నది తెలిసిందే. బాంబే స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ సెనె్సక్స్ 258 పాయింట్లు, నేషనల్ స్టాక్ ఎక్స్‌చేంజ్ సూచీ నిఫ్టీ 94 పాయింట్లు పెరిగాయి.