రాష్ట్రీయం

ఈపిఎఫ్‌ఒ కోసం ఫేస్‌బుక్, ట్విట్టర్ ఖాతాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపిఎఫ్‌ఓ) కార్యకలాపాలను ఫేస్‌బుక్, ట్విట్టర్ ద్వారా నిర్వహించేందుకు వీలుగా వాటిని కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి బండారు దత్తాత్రేయ శుక్రవారం ప్రారంభించారు. ఈ రెండింటి వల్ల ఈపిఎఫ్ సమస్యల పరిష్కారం, లబ్దిదారులకు సమాచారం వెంటనే తెలియజేసేందుకు ఈ సామాజిక మాధ్యమాలైన ఫేస్‌బుక్, ట్విట్టర్లు చాలా ఉపయోగపడతాయని అన్నారు. కేంద్ర సుపరిపాలన దినోత్సవం సందర్భంగా శుక్రవారం పిఎఫ్ ప్రధాన కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి దత్తాత్రేయ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పరిపాలనలో పారదర్శకత తీసుకు వచ్చేందుకు వీలుగా ఇటువంటి సామాజిక మాధ్యమాలు ఎంతో మేలు చేస్తాయని అన్నారు. అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని సేవలను మరింత విస్తత్రం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ కెకె జాలన్ పాల్గొని ప్రసంగించారు. సమాచారం చేరవేతలో ఫేస్‌బుక్, ట్విట్టర్లు సంస్థకు ఎంతో ఉపయోగమని అన్నారు.