విజయవాడ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, జూన్ 19: ఎడతెరిపి లేకుండా గురువారం సాయంత్రం నుండి కురుస్తున్న వర్షానికి చింతూరు మండలంలోని వాగులు ఉద్ధృత రూపం దాల్చాయి. చంద్రవంక, జల్లిగూడెం వాగుల నుండి రహదారిపైకి నీరు చేరడంతో రాకపోకలు స్తంభించాయి. చంద్రవంక వాగు ఉద్ధృతరూపం దాల్చడంతో చట్టి గ్రామ సమీపంలోని జాతీయ రహదారి - 30 పైకి వరద నీరు చేరింది. దీంతో ఛత్తీస్‌గఢ్, ఒడిషా, ఆంధ్ర, తెలంగాణా వైపు వెళ్లే వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. చంద్రవంక వాగు ఉద్ధృతి తగ్గకపోవడంతో నడుం లోతు నీటిలోనే వాగు దాటారు. వాగు దాటుతున్న బోర్‌వెల్ లారీ ఒకటి బోల్తాపడింది. డ్రైవరు, క్లీనర్ సురక్షితంగా తప్పించుకున్నారు. రాజమండ్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వాగు దాటుతున్న సమయంలో మధ్యలో నిలిచిపోయింది. చింతూరు సిఐ దుర్గారావు, ఎస్‌ఐ గజేంద్రకుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని బస్సును వాగు నుండి వెలుపలకు తీసుకొచ్చారు.