ఖమ్మం

మధ్యాహ్న భోజన బియ్యం మంజూరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 22: మండలంలోని వివిధ పాఠశాలలకు మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు 10.07క్వింటాళ్ళ బియ్యం మంజూరైనట్లు మండల విద్యాశాఖాధికారి ఇటికాల సత్యనారాయణ తెలిపారు. సెప్టెంబర్ మాసానికి గానూ మండలంలోని 74ప్రభుత్వ పాఠశాలలకు 6999మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు బియ్యం మంజూరైనట్లు ఎంఇఓ పేర్కొన్నారు. పాఠశాలకు మంజూరైన బియ్యాన్ని ఎంఐఎస్ విజయ్‌కుమార్ లారీద్వారా పాఠశాలలకు సరఫరా చేసినట్లు ఆయన వివరించారు. కాగా గతంలో రేషన్‌షాపు డీలర్ల నుండి ప్రధానోపాధ్యాయులు బియ్యాన్ని తీసుకొనివచ్చి వండించేవారు. అప్పట్లో లావుబియ్యంతో మధ్యాహ్న భోజనం అందించేవారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సన్నబియ్యం మంజూరు చేసింది. అయితే ఈ బియ్యాన్ని మండల విద్యాశాఖాధికారికి పంపడంతో ఆయన ఆ బియ్యాన్ని లారీతో వెళ్ళి పాఠశాలలకు సరఫరా చేయాల్సి వస్తోంది. ప్రతిరోజు పాఠశాలలను సందర్శించి విద్యార్థుల చదువులను పరీక్షించే ఎంఇఓకు ఈ బియ్యం బాధ్యతలు అప్పగించడంతో పాఠశాల విద్యావిధానం గాడితప్పుతోంది. ఎంఇఓలకు బియ్యం పంపిణీ బాధ్యత కాకుండా కేవలం పాఠశాలను పర్యవేక్షించే బాధ్యతనే అప్పగించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
రేపు స్థారుూ సంఘాల సమావేశం
ఖానాపురం హవేలి, సెప్టెంబర్ 22: ఈ నెల 24వ తేదీన స్థాయి సంఘాల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు జడ్పీ సిఈఓ మారుపాక నగేష్ ఒక ప్రకటనలో తెలిపారు.