ఆంధ్రప్రదేశ్‌

మరణానంతరం నలుగురికి ప్రాణదానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 23: అవయవదానాల పట్ల ప్రజల్లో ఇప్పుడిప్పుడే అవగాహన వెల్లివిరుస్తున్నది. కృష్ణాజిల్లా కేసరిపల్లికి చెందిన పి. నాగబాబు (24) ఈనెల 18వ తేదీ ప్రమాదానికి గురై మెదడుకు తీవ్ర దెబ్బతగిలింది. ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. తల్లిదండ్రులు జీవన్‌ధాన్ సంస్థను ఆశ్రయించి అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. జీవన్‌ధాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఛాన్సలర్ ప్రొఫెసర్ రవిరాజు వైద్య ప్రముఖులందరినీ క్షణాలపై రప్పించి మృతదేహం నుంచి రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కళ్లను తొలగించారు. వీటిలో ఒక కిడ్నీని స్థానిక ఆయుష్ ఆస్పత్రికి, మరో కిడ్నీని గుంటూరులోని సిటీ ఆస్పత్రికి, కాలేయాన్ని హైదరాబాద్‌లోని సాయివాణి ఆస్పత్రికి పంపించి రెండు కళ్లను ఐ-బ్యాంక్‌లో భద్రపరిచారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ రవిరాజు మాట్లాడుతూ నాగబాబు చనిపోవటం దురదృష్టకరమైనప్పటికీ నలుగురికి ప్రాణదానం చేయడం ఆ తల్లిదండ్రుల గొప్పదనంగా అభివర్ణించారు. ఇప్పటికి 40 మందికి కిడ్నీలు మార్పిడి చేయాల్సి ఉందని ఈ జాబితాను సిద్ధంగా ఉంచామన్నారు.
జీవన్‌ధాన్ సంస్థ కేవలం ఒక సేవా సంస్థగానే ఎలాంటి లాభాపేక్ష లేకుండా అవయవ దానాల్లో కీలకపాత్ర వహిస్తున్నదన్నారు. అవయవాలను భద్రపరిచే అవకాశం లేదన్నారు. రోజులు గడిచే కొద్దీ వాటి పనితీరు మందగిస్తుందన్నారు. అందుకే క్షణాలపై వాటిని సంబంధిత వ్యక్తులకు అమర్చాల్సి వస్తున్నదన్నారు.