రాష్ట్రీయం

విస్తరణే వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 22: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) తమ శాఖలను తెలంగాణలో మరింత విస్తరించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకొచ్చింది. రాబోయే రెండు మూడేళ్ళలో దేశవ్యాప్తంగా లక్షకుపైగా శాఖలను విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తూ, అన్ని సామాజిక వర్గాలనూ ఆకర్షించాలన్న పట్టుదలతో ఉంది. దేశ సామాజిక, రాజకీయం వంటి అనేకానేక అంశాలపై ఆదివారం నుంచి మూడు రోజులపాటు ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి (ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్) సమావేశాల్లో చర్చించనున్నారు. నగర శివారులోని ఘట్‌కేసర్ అన్నోజిగుడాలోని శ్రీ విద్య విహార్ పాఠశాల్లో 20న కార్యకారిణి సమావేశాలు ప్రారంభమైనా, ఆదివారం నుంచి మూడు రోజులపాటు కీలకమైన అంశాలపై చర్చించనున్నారు. శనివారం జరిగిన భేటీలో మూడు రోజులపాటు చేపట్టే అజెండాను ఖరారు చేశారు. దేశ భద్రత, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తేవడం వంటి పలు తీర్మానాలనూ సమావేశాల్లో చేయనున్నారు. ఇప్పటికే ప్రారంభమైన సమావేశాల్లో ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్ చాలక్ మోహన్ జీ భాగవత్ పాల్గొంటున్నారు. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమీత్ షా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, పార్టీ శాసనసభాపక్షం నాయకుడు జి కిషన్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు హాజరుకానున్నారు. ఇంకా స్వదేశీ జాగరణ్ మంచ్, బిఎంఎస్, బికెఎస్ వంటి అనుబంధ విభాగాల ముఖ్య నేతలతో కలిపి 500 మంది ప్రతినిధులు హాజరవుతారు.
2025నాటికి అన్ని గ్రామాల్లో..
ఆర్‌ఎస్‌ఎస్ ఆవిర్భవించి 2025 సంవత్సరం నాటికి వందేళ్లు పూర్తికానుంది. అప్పటికి దేశవ్యాప్తంగా అన్ని గ్రామాలకూ శాఖలు విస్తరించే యోచనలో ఉన్నారు. ప్రతి గ్రామంలో స్వయం సేవకులను తయారు చేసి శాఖలు నిర్వహించాలని ఆలోచన చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోనూ శాఖలను మరింత విస్తరించే దిశగా ప్రణాళిక సిద్ధమవుతోంది. తెలంగాణలో ప్రస్తుతం 2300 శాఖలున్నాయి. రెండు మూడేళ్ళలో మరో నాలుగు వందల శాఖలను విస్తరించాలన్న లక్ష్యంగా పెట్టుకున్నారు.
ఆసక్తి పెరుగుతుంది: మన్మోహన్ వైద్య
ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య మాట్లాడుతూ ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరాలన్న కోరిక దేశవ్యాప్తంగా ప్రజల్లో పెరుగుతున్నదన్నారు. దేశంలో ఇప్పటికే 52 వేల పైచిలుకు శాఖలు విస్తరించి ఉన్నాయని చెప్పారు. వీటిలో 65శాతం శాఖలు విద్యార్థులే నిర్వహిస్తున్నారన్నారు. విద్యార్థులు, యువత కలిపి నిర్వహిస్తున్న శాఖల సంఖ్య 91 శాతం ఉంటుందన్నారు. తాజాగా ఆర్‌ఎస్‌ఎస్‌లో చేరేందుకు వెబ్‌సైట్ ద్వారా 31,800 మంది ముందుకొచ్చారని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా కుల వివక్షతకు వ్యతిరేకంగా స్వయం సేవకులు పోరాటం చేస్తున్నారని చెప్పారు. దేవాలయాలు, స్మశానాల్లో కులవివక్ష ఉండరాదన్న అంశంపై తాము దేశవ్యాప్తంగా సర్వే చేయించామని, ఇందులో తెలంగాణలో తక్కువ ఉందన్నారు. విలేఖరుల సమావేశంలో ఆర్‌ఎస్‌ఎస్ తెలంగాణ మీడియా ఇన్‌ఛార్జి ఎన్ ఆయూష్ కూడా పాల్గొన్నారు. రాంపల్లి మల్లిఖార్జున్ రావు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
మీడియా సందడి
ఆర్‌ఎస్‌ఎస్ సమావేశాలకు వేదిక అయిన అన్నోజిగుడాలోని శ్రీ విద్య విహార్ పాఠశాల ప్రాంగణానికి జాతీయ, ప్రాంతీయ మీడియా ప్రతినిధులు, ప్రత్యక్ష ప్రసారం చేసే ఓబి వ్యాన్లతో తరలి రావడంతో సందడిగా మారింది. ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య నేతలు ఉండడంతో పోలీసు మెటల్ డిటెక్టర్లతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

చిత్రాలు.. మీడియాతో మాట్లాడుతున్న ప్రచార ప్రముఖ్ మన్మోహన్ వైద్య
ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారత కార్యకారిణి సమావేశాలకు ముస్తాబైన శ్రీవిద్యావిహార్ ప్రాంగణం.