కృష్ణ

అబద్ధాలకోరు చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అవనిగడ్డ, అక్టోబర్ 23: అనంతపురం జిల్లాలో రెయిన్‌గన్‌లతో వ్యవసాయం సస్యశ్యామలమైందని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదే జిల్లాలో 63 కరవు మండలాలను ప్రకటించటం ఏమిటని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షులు ఎంవిఎస్ నాగిరెడ్డి ప్రశ్నించారు. ఈ నిర్ణయంతో చంద్రబాబు పచ్చి అబద్ధాలకోరుగా తేలిందని విమర్శించారు. స్థానిక వైకాపా కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖర్లతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ప్రకటనలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సైతం తలవంచుకునేవిగా ఉన్నాయని, 6లక్షల రెయిన్‌గన్‌లు వినియోగించానని చెప్పిన చంద్రబాబు కరవు మండలాలను ప్రకటించటం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల కృష్ణాడెల్టాలో సాగుచేసే భూమి తగ్గిందని, ముఖ్యమంత్రి, వ్యవసాయ మంత్రి నివాసముండే గుంటూరు జిల్లాలోనే సాగు తక్కువగా నమోదైందని తెలిపారు. 43.86 వేల హెక్టార్లలో సాగుచేయాల్సి ఉండగా 32.62వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారని, 5.24 వేల హెక్టార్లలో ఇంకా సాగు మొదలుకాలేదని నాగిరెడ్డి వివరించారు. పులిచింతల లేకపోతే అసలు కృష్ణాడెల్టాకు సాగునీరు లేదని, కేవలం 7లక్షల టిఎంసిలతో కేవలం 32.62 వేల హెక్టార్లలో మాత్రమే సాగు చేశారన్నారు. దీంతో 30లక్షల టన్నుల ఆహార ఉత్పత్తుల పడిపోయాయని, ఈ నెల 1 నుండి వర్షం కూడా లేకపోవటంతో అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. 20వేల క్యూసెక్కుల గోదావరి నీరు సముద్రంలోకి వెళ్ళగా ఐదారు రోజుల్లో పట్టిసీమకు నీరురాని పరిస్థితి ఏర్పడిందన్నారు. పదిరోజుల్లో పట్టిసీమకు సాగునీరు రాదని, అప్పుడు ప్రత్యామ్నాయం ఏమిటని ఆయన ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అసలు కృష్ణాడెల్టా పరిస్థితి ఏమిటో చెప్పాలన్నారు. ఎకరం భూమి ఎండినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. రైతు సమస్యలపై వినతిపత్రం ఇస్తే అరెస్టులు చేస్తున్నారని, రైతు ప్రముఖులు కొల్లా వెంకయ్య కుమారుడిని అరెస్టు చేశారన్నారు. అదేమిటని అడిగితే పీడీ యాక్టు బనాయిస్తున్నారన్నారు. రైతు రుణాలు రెన్యువల్ చేయని కారణంగా బీమా సొమ్ము అందటం లేదన్నారు. ఈవిషయమై కరువు పీడిత రాష్ట్రంగా ప్రకటించేందుకు తాము ముఖ్యమంత్రితో చర్చలకు సిద్ధంగా ఉన్నామని నాగిరెడ్డి వివరించారు. విలేఖర్ల సమావేశంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ సింహాద్రి రమేష్‌బాబు, నాయకులు బి విజయలక్ష్మి, రేపల్లె శ్రీనివాసరావు, మాణిక్యాలరావు, సింహాద్రి వెంకటేశ్వరరావు, దామోదరరావు పాల్గొన్నారు.