ఆంధ్రప్రదేశ్‌

నిధుల వినియోగంలో సరళీకృత విధానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 27: జాతీయ స్థాయిలో నాబార్డు తీసుకున్న నిర్ణయాలను, నిధుల విషయంలో వున్న నిబంధనలను ఆయా రాష్ట్రాల స్థానిక పరిస్థితులు, వారి అవసరాలకు తగినట్టుగా మార్చుకునే వీలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. నాబార్డు నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రాజెక్టుకైనా ఖర్చు పెట్టుకునేలా అవకాశం కల్పిస్తే నూరుశాతం ఫలితాలు చూపిస్తామని ఆయన తెలిపారు. గురువారం సాయంత్రం క్యాంప్ కార్యాలయంలో నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ వివివి సత్యనారాయణ ముఖ్యమంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. వివిధ పథకాల కింద అందే నిధులను ఏకీకృతం చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం సిమెంట్ రోడ్లు, టాయిలెట్లు, ఫామ్‌పాండ్స్, తాగునీటి పథకాలు, అంగన్‌వాడీ పాఠశాలలు, ఇంకా అనేక ఇతర కార్యక్రమాలను పెద్దఎత్తున చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నాబార్డ్ సిజిఎంకు వివరించారు. ఉపాధి హామీ పథకం ద్వారా తొలి ఏడాది 4వేల కి.మీల సిమెంట్ రహదారులను నిర్మించామని, ఈ ఏడాది 5వేల కి.మీటర్ల మేర రహదారులు పూర్తి చేశామని తెలిపారు. నిధుల కన్వర్జెన్స్ ద్వారానే ఇన్ని కార్యక్రమాలు చేయగలుగుతున్నామని అన్నారు. అదే రీతిలో నాబార్డ్ రాష్ట్రానికి అందించే ఆర్థిక నిధులను రాష్ట్ర అవసరాలకు తగినట్టుగా వినియోగించుకునేందుకు నిబంధనలు సడలించాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ పనులకైనా ఈ నిధులు అవసరార్ధం వినియోగింగపడాలని అన్నారు. ముఖ్యంగా రూరల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఆర్‌ఐడిఎఫ్) కింద నాబార్డు కేటాయించే నిధులపై నిబంధనలను సరళీకరించి కన్వర్జెన్స్‌కు అంగీకరించేలా చూడాలని ముఖ్యమంత్రి నాబార్డ్ సిజిఎంకు సూచించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తరపున నాబార్డుకు లేఖ రాస్తానని తెలిపారు. నాబార్డు నిధులతో ఏ ప్రాజెక్టు చేపట్టినా పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించి సంబంధిత నివేదికను ఎప్పటికప్పుడు అందజేస్తామని, ప్రాజెక్టు డాక్యుమెంటేషన్ పక్కాగా వుండేలా చేసి నూరుశాతం నిధులను సద్వినియోగం చేసి చూపిస్తామన్నారు.

చిత్రం.. సిఎంని కలిసిన నాబార్డ్ సిజిఎం సత్యనారాయణ