ఆంధ్రప్రదేశ్‌

ప్రత్యేక ప్యాకేజీ నిధులతో తిరుగులేని అభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 28: ప్రత్యేక ప్యాకేజీతో వచ్చే నిధులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెంది దేశంలోనే ఉన్నత స్థానానికి చేరుకుంటుందని కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ఆకాంక్షించారు. బిజెపి రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం ఇక్కడ కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీకి సన్మానం జరిగింది. కేంద్రం అందించిన ఆర్థిక సాయాన్ని గురించి రాష్ట్రంలోని ప్రతి కార్యకర్త గర్వంగా చెప్పుకోవాలన్నారు. ఈ నిధులతో ఆంధ్రప్రదేశ్ తిరుగులేని విధంగా అభివృద్ధి చెంది దేశానికే తలమానికం కాగలదన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజనను తన స్వప్రయోజనాల కోసం వాడుకుందని ఆయన ఆరోపించారు. నాటి ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా ఇస్తామని అన్నా చట్టంలో పొందుపరచలేదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేసేందుకు అన్ని విధాల కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాకపోవడం వల్ల దాని కంటే అధికంగా నిధులు కేటాయిస్తూ ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినట్లు జైట్లీ చెప్పారు. 13వ ఆర్థిక సంఘం వల్ల 2004-2009లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి రూ.34,978 కోట్లు, 2009-14లో రూ.69వేల కోట్లు నిధులు విడుదలయ్యాయన్నారు. కాని 14వ ఆర్థిక సంఘం వల్ల రూ.2,03,100 కోట్లు నిధులు ఆంధ్రప్రదేశ్‌కు ఇస్తున్నట్లు చెప్పారు. ఆర్థికలోటు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐఐటి, ఎన్‌ఐటి, త్రిపుల్ ఐటి, ఐఐఎస్‌ఇఆర్, ఐఐఎం, ఎయిమ్స్ వంటి విద్యాసంస్థలు ఇప్పటికే ఏర్పడ్డాయని, సెంట్రల్ యూనివర్సిటీ, ట్రైబల్ యూనివర్సిటీ, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ తదితర సంస్థలు త్వరలో ఏర్పాటు కానున్నాయన్నారు. స్టీల్ ప్లాంటును విస్తరిస్తున్నామని, ఆంధ్రలోని విమానాశ్రయాల ఆధునీకరణ ఇప్పటికే జరిగిందని, రూ.65 వేల కోట్లతో రాష్ట్రంలో జాతీయ రహదారులు నిర్మించడం జరుగుతుందని హామీ ఇచ్చారు. పోలవరం నిర్మాణానికి కేంద్రం ఆర్థిక సహకారాన్ని అందిస్తుందని చెప్పారు. సాహసోపేత నిర్ణయాల ద్వారా దేశాన్ని అగ్రభాగంలో నిలబెట్టేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. దేశ రక్షణకు అత్యంత ప్రాధాన్యత కల్పిస్తూ, దౌత్యపరంగానూ, భద్రతా పరంగానూ పాకిస్తాన్ దాడులను సమర్థంగా ఎదుర్కొంటున్నారన్నారు. రెండున్నరేళ్లలో అవినీతి మచ్చుకైనా కనిపించడం లేదని ఇదీ బిజెపి ప్రభుత్వ ఘనతగా ఆర్థిక మంత్రి పేర్కొన్నారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ దేశంలో ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు ఏ రాష్ట్రానికి ఇవ్వనన్ని ప్రాజెక్టులు, నిధులు కేటాయించినట్టు వెల్లడించారు. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రధాని నరేంద్రమోదీ కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్భ్రావృద్ధికి ప్యాకేజీని రూపొందించటంలో జైట్లీ కృషి ప్రశంసనీయమన్నారు. పార్టీ జాతీయ కార్యదర్శి సిద్ధార్థనాథ్‌సింగ్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.2.25 లక్షల కోట్లు ప్రకటించినందుకు ఆర్థిక మంత్రి జైట్లీకి రాష్ట్ర శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రులు మాణిక్యాలరావు, కామినేని శ్రీనివాస్, ఎంపి గోకరాజు గంగరాజు తదితరులు పూలమాల వేసి శాలువాలు కప్పి సత్కరించారు.

చిత్రం.. బిజెపి కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న అరుణ్‌జైట్లీ